రెండు నెలల క్రితం చికాగో లో సంచలనం సృష్టించిన కేసు...శిశువు మృతి!  

Baby Cut Out Of Mother\'s Womb Dies In Usa-

అమెరికా లోని చికాగో లో రెండునెలల క్రితం సంచలనం సృష్టించిన కేసు.19 సంవత్సరాల గర్భవతిని హత్యచేసి కడుపు కోసి బిడ్డను తీసిన సంగతి తెలిసిందే.రెండు నెలల క్రితం చికాగోకి చెందిన ఒక మహిళ, ఆమె కూతురు కలిసి 19 సంవత్సరాల గర్భవతికి పేస్ బుక్ ద్వారా పరిచయం అయ్యి ఇంటికి ఆహ్వానించిన దారుణంగా హత్య చేసి అనంతరం కడుపుకోసి ఇంకా నెలలు నిండని బిడ్డను బయటకు తీసిన విషయం తెలిసిందే.మాల్రేన్‌ ఒహోవా లోపేజ్‌(19) అనే గర్భవతికి చికాగోకి చెందిన క్లారిస ఫిగురోవా(46),ఆమె కుమార్తె డేసిరీ(24) ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమయ్యారు.పిల్లలకు సంబంధించిన వస్తువులు తమ వద్ద లభిస్తాయని ఒహోవాను ఆకర్షించి తమ ఇంటికి రప్పించారు.అయితే లోపేజ్ ఆమె ఇంటికి వెళ్లిన అనంతరం ఒహోవా గొంతు నులిమి చంపి ఆమె కడుపు కోసి బిడ్డను బలవంతంగా బయటకు తీశారు...

Baby Cut Out Of Mother\'s Womb Dies In Usa--Baby Cut Out Of Mother's Womb Dies In USA-

ఏప్రిల్‌ 23న ఈ ఘటన చోటుచేసుకోగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.ఐతే తల్లి గర్భం నుంచి బయటకు తీసిన ఆ చిన్నారి ఊపిరి తీసుకోలేకపోవడం తో ఫిగురోవా ఆ శిశువును తన బిడ్డ అని చెప్పి ఆసుపత్రిలో చేర్పించింది.అనంతరం విషయం బయటకు రావడం తో ఫిగరోవా తో పాటు ఆమె కుమార్తె, మరియు వీరికి సహాయం చేసిన కుమార్తె ప్రియుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.అయితే గత కొద్ది రోజులుగా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్న ఆ శిశువు శ్వాస తీసుకోవడం లో ఇంకా ఇబ్బంది తలెత్తడం తో చివరకు బ్రెయిన్ డెడ్ అయ్యి శుక్రవారం మృతి చెందినట్లు తెలుస్తుంది.

Baby Cut Out Of Mother\'s Womb Dies In Usa--Baby Cut Out Of Mother's Womb Dies In USA-