వారి అలకను జగన్ ఇలా తీరుస్తున్నాడా

వారంతా పార్టీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు.మొదటి నుంచి పార్టీ అధినేత వెన్నంటే ఉన్నారు.

 1andhra Pradesh Cm Jagan Created Posts And Given To Ycp Party Leaders-TeluguStop.com

అధికార పార్టీ నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.అయినా ఎప్పుడూ అధినేత మాట జవదాటలేదు.

దాదాపు తొమ్మిదేళ్ల పాటు అధికార పార్టీలతో పోరాడాడుతూనే ప్రజల మద్దతు భారీగా కూడగట్టారు.ఇంకేముంది పార్టీ అధికారంలోకి వచ్చేసింది.

ఇంకేముంది తమ కష్టం తీరిపోయింది.ఇక మనకి అన్నీ మంచి రోజులే, మొదటి నుంచి అధినేత వెంటే ఉన్నాము కాబట్టి తమకు కీలక పదవులు దక్కుతాయి అని భావించారు.

కట్ చేస్తే అసలు ఎవరికీ దక్కుతాని ముందు నుంచి అంచనా వేసుకున్నారో వారెవరికీ మంత్రి పదవులు దక్కలేదు.ఎవరూ ఊహించనివారికి కీలకమైన శాఖలు దక్కాయి.

అయితే పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన వారి సంగతి ఏంటి ? వారి పరిస్థితి అంతేనా అని అంతా చర్చించుకుంటున్న వేళ జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు.

మంత్రి పదవులు దక్కని పార్టీ సీనియర్ నాయకుల్లో బ‌య‌ట ఎక్క‌డా అసంతృప్తి క‌నిపించ‌కున్నా లోలోపల మాత్రం చాలామంది ఎమ్మెల్యేలు మంత్రి ప‌ద‌వులు ద‌క్క‌క అసంతృప్తికి గుర‌య్యారు.

దీంతో ఇత‌ర ప‌ద‌వుల ద్వారా వారిని బుజ్జ‌గించేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నాడు.అందుకే విప్ ప‌ద‌వులు, నామినేటెడ్ ప‌ద‌వుల‌తో పాటు కొత్త‌గా ప‌ద‌వులు సృష్టించి మ‌రీ ఎమ్మెల్యేల‌కు కట్టబెట్టినందుకు ప్లాన్ చేస్తున్నాడు.

దీనిలో భాగంగానే వైసీపీకి బ‌ల‌మైన వాయిస్‌గా ఉన్న రోజాకు మంత్రి ప‌ద‌వి దక్కక తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఆమెకు నామినేటెడ్ ప‌ద‌వుల్లో కీల‌క‌మైన ఏపీఐఐసీ ఛైర్‌ప‌ర్స‌న్ ప‌ద‌విని ఇచ్చాడు జగన్.

అలాగే ముందునుంచి తనకు చేదోడు వాదోడుగా ఉంటూ వస్తున్న ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డికి చీఫ్ విప్ ప‌ద‌వి, కాపు రాంచంద్రారెడ్డి, పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి, ముత్యాల నాయుడు, కోర‌ముట్ల శ్రీనివాసులు, సామినేని ఉద‌య‌భాను, దాడిశెట్టి రాజాల‌ను జ‌గన్ నియ‌మించారు.

వీరితో పాటు మరికొంత మందికి ఈ విధంగానే కీలకమైన పదవులను ఇచ్చి బుజ్జగించాలని జగన్ చూస్తున్నాడు.దీనిలో భాగంగానే అన్ని ప్రాంతాల స‌మ‌గ్ర అభివృద్ధి కోసం ప్రాంతీయ అభివృద్ధి బోర్డులు ఏర్పాటు చేశారు.

ఐదు బోర్డుల‌ను ఏర్పాటు చేసి వాటికి ఛైర్మ‌న్లుగా ఎమ్మెల్యేలు పార్థ‌సార‌థి, అనంత వెంక‌ట్రామిరెడ్డి, కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి, దాడిశెట్ది రాజా వంటి వారిని నియ‌మించారు.అలాగే సీఆర్డీఓ ఛైర్మ‌న్‌గా మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డిని నియమించబోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube