అమెరికా శాస్త్రవేత్తల పరిశోధన.. కాస్మోటిక్స్ డేంజర్..  

American Scientist Says Cosmetics Are Danger-childrens,cosmetics,cosmetics Are Danger,health Issues,చర్మం కాలినట్లుగా రావడం,చర్మ వ్యాధులు

కాస్మోటిక్స్ వినియోగం పిల్లల ఆరోగ్య పరిస్థితిపై తీవ్రమైన ప్రభావం చూపుతోందని అమెరికా శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ క్రమంలో వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వారు చేసిన అధ్యయనంలో ప్రతీ రెండు గంటలకి ఒక సారి ఓ చిన్నారి ఆసుపత్రి పాలవుతోందని తెలిపారు..

అమెరికా శాస్త్రవేత్తల పరిశోధన.. కాస్మోటిక్స్ డేంజర్..-American Scientist Says Cosmetics Are Danger

తమ సౌదర్యం పెంపు కోసం ఉపయోగించే షాంపూ, లోక్షన్లు వంటివి ఉపయోగించడం శరీరంపై అనుకోని విధంగా దద్దుర్లు ఏర్పడుతున్నాయని దాంతో దాక్టర్ వద్దకు వేల్లాలిసిన పరస్థితి వస్తోందని తెలిపారు.

2002 నుంచి 2016 మధ్య కాలంలో దేశం మొత్తం నిర్వహించిన అధ్యయనంలో 64,686 మంది ఐదేళ్ళ లోపు చిన్నారులు వైద్య చికిత్స పొందినట్లుగా తేలిందని వారు తెలిపారు. వారి వల్ల చర్మ వ్యాధులు, చర్మం కాలినట్లుగా రావడం జరుగుతోందని అన్నారు. అంతేకాదు కనుపాపలకు ఉపయోగించే కాస్మోటిక్ వల్ల కంటి చూపు తగ్గడం జరిగిందని స్థానికంగా వెలువడే జర్నల్ తెలిపింది.

చిన్న పిల్లలకి రంగు రంగుల కాస్మోటిక్స్ కనిపించడంతో పాటు సువాసన రావడంతో వాటిని ఉపయోగించేందుకు ఎంతో ఇష్టం చూపుతారని.అదేదే పానీయం అని భావించి ఇష్టపడుతారని తెలిపింది. గోర్లపై నిల్ పాలిష్ కూడా ఎంతో ప్రమాద కరమైనదని తెలిపింది..