అమెరికాలో పోలీసులని పరుగులు పెట్టించిన వింత దొంగ

అమెరికాలోని టెక్సాస్ లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది.అర్ధరాత్రి ఓ మహిళ ఇంట్లో గ్లాస్ పగిలిన శబ్దం రావాడంతో.

 1america Police Find A Deer In A House After The Homeowner Mistook It For A Bur-TeluguStop.com

ఒక్క సారిగా భయపడిన ఆమె ఆందోళనగా పోలీసులకి ఫోన్ చేసింది.తన ఇంట్లో దొంగ ప్రవేశించాడని, అద్దం పగులకొట్టి మరీ లోపలి వచ్చాడని, ఏవో శబ్దాలు సైతం వినిపిస్తున్నాయని ఆ మహిళ పోలీసులకి తెలిపింది.

దాంతో ఒక్క సారిగా పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టారు.

అమెరికాలో పోలీసులని పరుగులు �

దొంగని ఎలాగైనా సరే పట్టుకోవాలని ఆ ఇంటి చుట్టూ రౌండప్ చేసిన పోలీసులు, దొంగకి హెచ్చరికలు కూడా జారీ చేశారు.ఎటువంటి నేరానికి పాల్పడకుండా బయటకి రావాలని, లేదంటే పరిణామాలు దారుణంగా ఉంటాయని తమదైన శైలిలో బెదిరింపులు చేశారు.అయినా సరే దొంగ బయటకి రాకపోవడంతో.

మహిళ ఇంటి తలుపులు బద్దలు కొట్టి మరీ లోనికి వెళ్ళారు.కానీ ఆ దొంగని చూసిన పోలీసులు షాక్ కి గురయ్యారు.ఇంత హడావిడి చేసింది ఈ దొంగ కోసమా అంటూ నవ్వుకున్నారు.ఇంతకీ పోలీసులు లోనికి వెళ్ళగానే అక్కడ దొంగ కనపడలేదు, ఓ జింక పరిగెడుతూ కనిపించింది.

దాంతో అవ్వాక్కయిన పోలీసులు జింకని బయటకి పంపేసి ఆ మహిళకి ధైర్యం చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube