క్యూబాకి మద్దతుగా..ట్రంప్ కి చెక్ పెట్టిన డెమోక్రాట్లు..  

America Democratic Party Leaders Support In Cuba-

త్వరలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు రానున్న నేపధ్యంలో అమెరికా రాజకీయాలు వేడెక్కాయి.ట్రంప్ చేసే ప్రతీ తప్పుని ఎత్తి చూపుతూ ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించాలని ప్రయత్నాలు చేస్తున్నాయి.చాలా విషయాలలో డెమోక్రాట్లు సక్సెస్ అవుతున్నారు కూడా.అయితే తాజాగా డెమోక్రాట్లు తీసుకున్న నిర్ణయంతో అమెరికా ప్రజల మనసు గెలుచుకోవడమే కాకుండా ప్రపంచం దృష్టిని ఆకర్షించారు.

America Democratic Party Leaders Support In Cuba--America Democratic Party Leaders Support In Cuba-

వచ్చే అమెరికా ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వచ్చేనట్టయితే తప్పకుండా క్యూబాతో మెరుగైన సంభంధాలు ఏర్పరుచుకుంటామని పలువురు డెమోక్రటిక్ పార్టీ నేతలు హామీ ఇచ్చారు.ప్రస్తుతం ట్రంప్ క్యూబ పట్ల అనుసరిస్తున్న తీరుని ఎండగట్టారు.క్యూబ చిన్నదేశం అయినా సరే వారిపై కాలు దువ్వడం సరికాదని అన్నారు.పక్కనే ఉన్న దేశాలతో సానుకూలంగా ఉండాల్సిన అవసరం ఉందని ట్రంప్ ప్రవర్తనా తీరు సరైనది కాదని విమర్శించారు.

America Democratic Party Leaders Support In Cuba--America Democratic Party Leaders Support In Cuba-

ఈ మేరకు డెమొక్రాటిక్ పార్టీ నుంచీ అధ్యక్ష ఎన్నికల బరిలో దిగేందుకు సిద్దంగా ఉన్న దాదాపు 20 మంది నేతలు ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.ఈ ప్రకటనలో ముఖ్యంగా సెనేటర్‌ అమీ క్లబుచర్‌ క్యూబాతో సంబంధాల పెంచుకోవడం కోసం అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తుండటం గమనార్హం.