టాలీవుడ్ ని కూడా తాకిన జీరోసైజ్....లిస్ట్ లో కీర్తి సురేష్  

Actres Keerthi Suresh Lost Her Weight-bollywood,keerthi Suresh,mahanati,rakul Preeth Sing,samantha,tollywood

ఒకప్పుడు కేవలం బాలీవుడ్ కె పరిమితమైన జీరో సైజ్ ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్స్ కూడా తెగ ఫాలో అయిపోతున్నారు. దీనితో మొన్నటివరకు క్యూట్ గా బొద్దుగా కనిపించిన చాలా మంది టాలీవుడ్ హీరోయిన్స్ తెగ కండలు కరిగించేసి బక్క పలచగా మారిపోతున్నారు. మొన్న రకుల్ ప్రీత్ సింగ్,నిన్న సమంత ఇలా చాలా మంది ఈ జీరో సైజ్ మెయిటైన్ చేస్తున్నారు..

టాలీవుడ్ ని కూడా తాకిన జీరోసైజ్....లిస్ట్ లో కీర్తి సురేష్ -Actres Keerthi Suresh Lost Her Weight

అయితే ఇప్పుడు తాజాగా ఈ లిస్ట్ లో మన బొద్దు గుమ్మ మహానటి కీర్తీ సురేష్ కూడా చేరిపోయింది. చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్లు కీర్తి చిక్కి పోయి కనిపించినప్పటికీ అందంగానే ఉంది. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక ఫోటో ను షేర్ చేయగా దానిని చూసిన అభిమానులు నైస్ లుక్ అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు.

కొందరేమో మునుపటి క్యూట్ నెస్ మిస్ అవుతున్నాం అని కూడా అన్నారనుకోండి. ఇటీవల టాలీవుడ్ లో కూడా చాలా మంది ఇదే ట్రెండ్ ఫాలో అవుతుండడం తో అభిమానులు కొందరు మెచ్చుకుంటుండగా కొందరేమో వారిలో గ్లో చాలా తగ్గిందని, అస్తిపంజరంలా తయారవుతున్నారని అభిప్రాయపడుతున్నారు.

అయినా వారినేం పట్టించుకోకుండా మన టాప్ హీరోయిన్లు కష్టపడి మరీ కండలు కరిగించేస్తున్నారు .

ప్రస్తుతం కీర్తి సురేశ్ పలు ప్రాజెక్ట్‌లలో నటిస్తుండగా అందులో ఒకటి బాలీవుడ్ మూవీ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అజయ్ దేవగన్ సరసన నటిస్తున్న కీర్తీ ఆ చిత్రం కోసమే ఇంత భారీ గా తగ్గినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా కొత్త దర్శకుడు నరేంద్ర నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సఖి,జాతీయ అవార్డు గ్రహీత నగేష్ కుకునూరు దర్శకత్వంలో మరొకటి, అలానే కింగ్ నాగార్జున సరసం మన్మధుడు-2 లో నటీస్తూ ఫుల్ బిజీ గా ఉంది.