అఖిల్ కు తల్లిగా మరోసారి ఆమె...బ్లాక్ బస్టర్ అవుతుంది అంటున్న అభిమానులు  

Aamani Going To Play Mother Character In Akhil Next Movie-

ఎప్పుడో 24 ఏళ్ల క్రితం హీరో అక్కినేని అఖిల్ కు తల్లిగా నటించిన నటి ఇప్పుడు తాజాగా మరోసారి అఖిల్ తల్లిగా నటించనున్నట్లు తెలుస్తుంది.అఖిల్ హీరోగా పరిచయం అవుతూ వచ్చిన తోలి చిత్రం అఖిల్, అక్కడ నుంచి హలొ, మిస్టర్ మజ్నూ వంటి చిత్రాలు చేసినప్పటికీ అఖిల్ కు ఏ ఒక్క చిత్రం కూడా మంచి బ్రేక్ ఇవ్వలేదు.దీనితో చాలా గ్యాప్ తీసుకొని బొమ్మరిల్లి భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ తన నాలుగో చిత్రాన్ని ప్లాన్ చేసుకున్నాడు.గీతా ఆర్ట్స్ బేనర్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా,అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు...

Aamani Going To Play Mother Character In Akhil Next Movie--Aamani Going To Play Mother Character In Akhil Next Movie-

అలానే గోపీ సుందర్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు.కొద్దీ రోజుల క్రితమే ఈ చిత్రం గ్రాండ్ గా లాంచ్ కాగా, రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు నుంచి జరగనున్నట్లు తెలుస్తుంది.

అయితే చిత్ర పరిశ్రమ నుంచి అందిన సమాచారం ప్రకారం అఖిల్ నాలుగో చిత్రంలో అఖిల్ కు తల్లిగా సీనియర్ నటి ఆమని నటిస్తున్నట్లు తెలుస్తుంది.

Aamani Going To Play Mother Character In Akhil Next Movie--Aamani Going To Play Mother Character In Akhil Next Movie-

దీనితో 24 ఏళ్ల క్రితం అఖిల్ బాల నటుడుగా చేసిన చిత్రం సిసింద్రీ, ఈ చిత్రంలో నటి ఆమని నే అఖిల్ కు తల్లి పాత్రలో కనిపించింది.అయితే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తరువాత మరోసారి అఖిల్ కోసం తల్లిగా మారింది.అప్పుడు సిసింద్రీ చిత్రం ఎంత సూపర్ హిట్ అయ్యిందో, ఇప్పుడు అఖిల్ నాలుగో చిత్రం కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.