ఆస్కార్‌ దక్కించుకున్న టీంలో మనోళ్లు

ఆస్కార్‌ అంటేనే ఎక్కువగా హాలీవుడ్‌ వారికి దక్కుతుందని అంతా అనుకుంటూ ఉంటారు.కాని హాలీవుడ్‌ వారికి మాత్రమే కాకుండా అప్పుడప్పుడు మన ఇండియన్స్‌కు కూడా ఆస్కార్‌ దక్కుతూనే ఉంది.

 1917 Movie Getting Oscar Awards-TeluguStop.com

అప్పుడెప్పుడో స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌ సినిమాకు ఆస్కార్‌ అవార్డులు వచ్చాయి.మళ్లీ ఆస్కార్‌ మనకు దక్కింది లేదు.

అయితే ఈసారి 1917 అనే సినిమాకు ఆస్కార్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ విభాగంలో దక్కింది.ఆ సినిమా విజువల్‌ ఎఫెక్ట్స్‌ టీంకు ఆస్కార్‌ దక్కడంతో మన ఇండియాలో కూడా చాలా మంది సంతోషంగా ఉన్నారు.

1917 చిత్రంకు సంబంధించిన దాదాపు 40 శాతం విజువల్‌ ఎఫెక్ట్స్‌ షాట్స్‌కు ఇండియాలోనే వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ జరిగిందట.అందులో చాలా మంది మన తెలుగు వారు కూడా పాలు పంచుకున్నారు.

ఈ విషయాన్ని తాజాగా పలువురు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు.ఇండియన్స్‌ వర్క్‌ చేసిన 1917 సినిమాకు ఆస్కార్‌ రావడంతో అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పెద్ద ఎత్తున విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఉన్న చిత్రంగా 1917 చిత్రం నిలిచింది.ఇండియాలో విజువల్‌ ఎఫెక్ట్స్‌కు అద్బుతమైన స్కోప్‌ ఉందని ఈ చిత్రం నిరూపించింది.

ముందు ముందు ఇండియాలో మరిన్ని ఇలాంటి వీఎఫ్‌ఎక్స్‌ చిత్రాల వర్క్‌ జరుగుతాయని ఆశిద్దాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube