ఈ ఫొటోలోని అమ్మాయి వయసు ఎంతో తెలిస్తే షాకే..!

అమ్మాయిలకు నిత్యయవ్వనంగా కనిపించడం ఒక వరం.కానీ నిత్యం చిన్న పిల్లలా ఉండిపోవడం ఒక శాపం అని చెప్పవచ్చు.

 19 Years Old Girl Aboli Jarit From Nagpur Looks Like A Child Details, Grils Age,-TeluguStop.com

నిజానికి మగవారైనా సరే వయసుకు తగినట్టుగా మానసికంగా, శారీరకంగా పెద్దవ్వకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.పెరుగుదల మరీ చిన్నతనంలోనే ఆగిపోతే వారి పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది.

ఇలా పెరుగుదల ఆగిపోయిన వారు చూసేందుకు చిన్నవారిలా కనిపిస్తారు కానీ వారి అసలు వయస్సు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.పై ఫొటోలో చాలా క్యూట్ గా కనిపిస్తున్న అమ్మాయి కూడా నిజంగా చిన్న అమ్మాయి కాదు.

ఆ అమ్మాయి వయసు అక్షరాలా 19 ఏళ్లు. అయినా చూసేందుకు నాలుగేళ్ల చిన్న పాప లాగా కనిపిస్తుంది.

వివరాల్లోకి వెళితే… మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో అబోలి జరిత్ అనే ఒక యువతి నివసిస్తోంది.ఈమె చిన్నతనంలోనే మూత్రపిండం, ఎముకలకు సంబంధించిన రోగాల బారిన పడింది.ఈ కారణంగా 3 అడుగుల 4 అంగుళాల కంటే ఎత్తు పెరగలేకపోయింది.ప్రస్తుతం ఆమె వయసు 19 ఏళ్లు అయినప్పటికీ చిన్నపిల్లలా కనిపిస్తోంది.

ఈమెకు పుట్టుకతో మూత్రాశయం రాలేదు.దీంతో ఎల్లప్పుడూ డైపర్ ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

బాడీలో మూత్రం స్టోర్ అవ్వకుండా వైద్యులు ఆమె నడుం వద్ద ఒక హోల్ చేశారు.

ఇలాంటి పరిస్థితుల వల్ల ఆమెకు నడవడం కూడా కష్టతరమయింది.

దీనికి తోడు వయసు పెరుగుతున్న కొద్దీ ఆమె ఎముకలు మరింత బలహీనంగా తయారవుతాయి.

Telugu Aboli Jarit, Grils Age, Indian Idol, Child, Maharashtra, Nagpur, Physical

ఫలితం ఆమె వీల్‌చైర్‌లో కూర్చోడం తప్ప నడవలేకపోతోంది.జరిత్‌కు చిన్నప్పటి నుంచి డ్యాన్స్, పాడటం అంటే ఇష్టం, కానీ ఎముకలు బలహీనంగా మారాయి కాబట్టి నడవడం లేదా నిలబడటం కూడా మానేసింది.ఆమె తన కాళ్లను ఉపయోగించలేనప్పటికీ తన స్వరాన్ని ఉపయోగించాలని నిశ్చయించుకుంది.

ఈ చిన్నారి ‘ఇండియన్ ఐడల్’కి కూడా ఒకసారి వెళ్ళింది.బాలీవుడ్, హాలీవుడ్‌లో సింగర్, యాక్ట్రెస్ గా మారాలనుకుంటున్నానని అబోలి తన డ్రీమ్ గురించి ఒక న్యూస్ పేపర్ కి వెల్లడించింది.

అయితే ఆన్ లైన్ లో తన శారీరక వైఫల్యాన్ని ఎగతాళి చేస్తూ కొందరు ఆమె మనసును గాయపరుస్తున్నారట.ఈమె గురించి తెలుసుకున్న చాలామంది మాత్రం అయ్యో పాపం అని సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube