అమెరికా పోలీసులకి సవాల్ విసిరాడు..దూల తీరిపోయింది...!!!

అమెరికాలో అత్యవసర పోలీసు టోల్ ఫ్రీ నెంబర్ 911.ఆపదలో ఈ నెంబర్ కి కాల్ చేస్తే పోలీసులు క్షణాలలో అక్కడి వచ్చి చేరుకుంటారు, సాయం అందిస్తారు.

 19 Years Old Drunken Nikolas Calls To 911-TeluguStop.com

అయితే 19 ఏళ్ల నికోలస్ అనే కుర్రాడు తాగిన మైకంలో 911 లో కాల్ చేసి ఇప్పటి వరకూ నేను మూడు చోట్ల ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేశానని, ఒక్క పోలీసు కూడా నన్ను పట్టుకోలేరని మీరు వేస్ట్ అంటూ వారిని నోటికి వచ్చినట్టుగా తిట్టాడు.

అమెరికా పోలీసులకి సవాల్ విసి�

అక్కడితో ఆగకుండా మీకసలు దమ్ముంటే నన్ను పట్టుకోగలరా అంటూ సవాల్ విసిరాడు.దాంతో అతడి మాటలను ఛాలెజింగ్‌గా తీసుకున్న పోలీసులు పక్కా ప్లాన్ ప్రకారం అతడిని పట్టుకున్నారు.ఆ తరువాత కారులో సోదాలు చేయగా, డిక్కీ లో మాదకద్రవ్యాలు భారీ మొత్తంలో దొరికాయి.

అంతేకాదు సెయింట్ జాన్స్ కౌంటీ పోలీస్ కార్యాలయం పరిధిలో అతడిపై వారెంట్ ఉన్నట్లుగా గుర్తించారు.

మరింత అనుమానం రావడంతో కారుని పూర్తిగా పరిశీలించిన పోలీసులకి దిమ్మ తిరిగిపోయింది.

కారులో భారీ మొత్తంగలో గంజాయి దొరకడంతో పాటు తెల్లని మత్తుమందు పదార్ధం కూడా దొరికిందట.అయితే విచారణలో భాగంగా అసలు ట్రాఫిక్ రూల్స్ ఎందుకు బ్రేక్ చేశావ్ అని అడిగేతే ఊరికే సరదాకి చేశా, చేయకూడదా అంటూ తిక్క తిక్కగా సమాధానాలు చెప్పాడట.

అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మాదకద్రవ్యాల కేసు తో పాటు, ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన కేసుని నమోదు చేశారని తెలుస్తోంది.మొత్తానికి పోలీసులకి ఛాలెంజ్ విసిరి అడ్డంగా బుక్కాయాడు నికోలస్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube