దుబాయ్‌లో రోడ్డు ప్రమాదం: భారతీయ విద్యార్ధి దుర్మరణం  

19 Year Old Indian Killed In Dubai Road Accident - Telugu , Dubai, Road Accident, Telugu Nri News

దుబాయ్‌లో విషాదం చోటు చేసుకుంది.భారతదేశానికి చెందిన ఓ విద్యార్ధి అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలవ్వగా మరొకరు గాయపడ్డారు.దుబాయ్‌లోని షేక్ జాయెద్ రోడ్‌లో శుక్రవారం తెల్లవారుజామున 5.27 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు గల్ఫ్ న్యూస్ తన వార్తా కథనంలో ప్రచురించింది.
బాధితులిద్దరూ ప్రయాణిస్తున్న వ్యాన్‌ను స్టేషనరీ లోడుతో వెళుతున్న ట్రక్కు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో భారత విద్యార్ది అక్కడికక్కడే మరణించాడు.బాధిత విద్యార్ధిని కేరళ రాష్ట్రం మలప్పురానికి చెందిన మొహమ్మద్ సావద్‌ (19) గా గుర్తించారు.

19 Year Old Indian Killed In Dubai Road Accident

ప్రమాదం జరిగినప్పుడు సావద్ ప్రయాణికుల సీట్లో కూర్చొని ఉన్నట్లు గల్ఫ్ న్యూస్ తెలిపింది.అదే సమయంలో డ్రైవింగ్ చేస్తున్న కేరళకే చెందిన మొహమ్మద్ అబ్దుల్ బారి (42) తీవ్రంగా గాయపడ్డాడు.

అతనిని దుబాయ్‌లోని ఆసుపత్రికి తరలించారు.
వీరిద్దరూ అబుదాబీలో నివసిస్తూ, కిరణా షాపులకు చేపలను సప్లై చేస్తారు.

దుబాయ్‌లో రోడ్డు ప్రమాదం: భారతీయ విద్యార్ధి దుర్మరణం-Telugu NRI-Telugu Tollywood Photo Image

దీనిలో భాగంగా చేపలను కొనేందుకు శుక్రవారం వ్యాన్‌లో దుబాయ్ వచ్చి తిరిగి అబుదాబి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

19 Year Old Indian Killed In Dubai Road Accident Related Telugu News,Photos/Pics,Images..

footer-test