అదే సీన్ రిపీట్..ఊహించని సంఘటనతో ఉలిక్కిపడ్డ అమెరికన్స్..!!

చింత చచ్చినా పులుపు చావదనే సామెత సరిగ్గా అమెరికాలో జరిగే సంఘటనలకి సరిపోతుంది.ఒక పక్క అమెరికాలో ప్రజలు కరోనా మహమ్మారి కారణంగా గుండెలు చేత్తో పట్టుకుని బ్రతుకుతున్నారు.

 Shot In Cincinnati, Us, Extremely Violent Night, Gun Culture, Police, Gunfire Er-TeluguStop.com

ఈ మహమ్మారి ఎప్పుడు వదిలిపోతుంది మళ్ళీ ఎప్పుడు మంచి రోజులు వస్తాయో అంటూ ఆశగా ఎదురు చూస్తున్నారు.ఇలాంటి సమయంలో ఎప్పటిలానే అమెరికాలో కాల్పుల మోత మోగింది.

అయితే ఎప్పటిలా ఒక్క చోట మాత్రమే కాదు మొత్తం నాలుగు ప్రాంతాలలో కాల్పులు జరగడంతో అమెరికన్స్ ఉలిక్కిపడ్డారు…ఈ సంఘటన వివరాలలోకి వెళ్తే.

అమెరికాలోని సిన్సినాటీ లో వేరు వేరు ప్రాంతాలలో ఒక్క సారిగా కాల్పుల ఘటన జరిగింది.

ఊహించని ఈ ఘటనతో స్థానిక ప్రజలు భయాందోళనకి గురయ్యారు.ఈ ఘటనలో సుమారు నలుగురు అమెరికన్స్ ప్రాణాల పోగా, దాదాపు 18 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది.

మరో సంఘటన ఓవర్ ది రైన్ ఏరియాలో జరుగగా అక్కడ ఒకరు మృతి చెందారని, సుమారు 10 మందికి పైగా గాయపడ్డారని తెలుస్తోంది.అలాగే వాల్ నట్ హిల్స్ లో జరిగిన కాల్పుల ఘటనలో ముగ్గురు గాయాల పాలయ్యారు అంతేకాదు టెక్సాస్ లో ఆస్టిన్ లో దుండగులు ఏకంగా పోలీసులపై కాల్పులు జరిపారు.

కేవలం ఒక్క సిన్సినాటీ లో వేరు వేరు ప్రాంతాలలో జరిగిన ఈ ఘటనలు మొత్తం నలుగురు మృతి చెందారని పోలీసులు తెలిపారు.అయితే కాల్పులకి సంభందించిన పూర్తి కారణం తెలియరాలేదని, కానీ ఘటన జరిగిన ప్రాంతాలలో ఉన్న సిసి టీవీ పుటేజ్ లు ఆధారంగా విచారణ జరిపి త్వరలో నిందితులని పట్టుకుంటామని తెలిపారు పోలీసులు.

కాగా కేవలం ప్రభుత్వం గన్ కల్చర్ ని ప్రోశ్చహించడం వలనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఎంతో మంది అమాయక ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని అంటున్నారు గన్ కల్చర్ కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ప్రజా సంఘాల నేతలు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube