వైరల్‌ : 18 వేల సంవత్సరాల నాటి కుక్క ఇది, ఎలా ఉందో చూస్తే అవాక్కవ్వాల్సిందే  

18,000-year Old Dog Perfectly Intact In Siberian Permafrost-18,18 వేల సంవత్సరాల నాటి కుక్క,belaya Gora,drogo,northeast Siberia,siberian Permafrost,సైబీరియా

మనిషి శరీరం అయినా, జంతువు శరీరం అయినా కూడా చనిపోయిన వారం పది రోజుల్లోనే కుళ్లి పోతుంది.కొన్ని సార్లు తప్పనిసరి పరిస్థితుల్లో డెడ్‌ బాడీని అలాగే ఉంచడం కోసం ఐస్‌ బాక్స్‌లో పెట్టడం జరుగుతుంది.కాని అది కూడా చాలా కాలం ఉండటం కష్టం.అనాధ శవాలను కొన్ని వారాలు లేదా నెలల పాటు బాక్స్‌లో ఉంచి ఆ తర్వాత దాన్ని ఖననం చేస్తారు.

18,000-year Old Dog Perfectly Intact In Siberian Permafrost-18,18 వేల సంవత్సరాల నాటి కుక్క,belaya Gora,drogo,northeast Siberia,siberian Permafrost,సైబీరియా Telugu Viral News-18 000-year Old Dog Perfectly Intact In Siberian Permafrost-18 వేల సంవత్సరాల నాటి కుక్క Belaya Gora Drogo Northeast Siberia Siberian Permafrost సైబీరియా

అలా ఇప్పటి వరకు ఎన్నో శరీరాలను ఉంచి ఖననం చేశారు.ఈజిప్ట్‌లో శరీరాలను ఖననం చేసే సమయంలో రసాయనాలు ఉపయోగించి అవి చెడిపోకుండా ఉండేలా ప్రయత్నాలు చేస్తారు.

ఐస్‌ బాక్స్‌లో పెట్టిన ఎక్కడ ఉంచినా కూడా శరీరం అనేది మెల్లగా కుళ్లి పోవడం ఖాయం.కాని ఆమద్య పూరి జగన్నాధ్‌ మెహబూబా సినిమాలో చూపించినట్లుగా హీరోయిన్‌ శవం మంచు కొండల్లో ఉండటంతో అలాగే ఉంది.

చాలా ఏళ్లు అయినా కూడా మంచు కొండల్లో ఉండటం వల్ల ఆ శరీరం అలాగే ఉండి పోయింది.అది సినిమా కాబట్టి అలా ఉంది అనుకున్నాం.కాని దాదాపుగా 18 వేల ఏళ్ల నాటి ఒక కుక్క శవంను శాస్త్రవేత్తలు గుర్తించారు.

సైబీరియాలోని ఏ మంచు ఎడారిలో 18 వేల ఏళ్ల క్రితం చనిపోయిన కుక్కను శాస్త్రవేత్తలు గుర్తించారు.మంచులోకి తల భాగం వరకు కూరుకు పోయి ఉంది.

దాంతో తల భాగం వరకు చెక్కు చెదరకుండా ఉంది.ఇక ఇతర శరీర భాగం మాత్రం స్వల్పంగా కుల్లిపోయింది.పలు పరిశోదనలు చేసిన తర్వాత శాస్త్రవేత్తలు ఈ కుక్క 18 వేల ఏళ్ల క్రితంకు చెంది ఉంటుందని గుర్తించారు.ఈ కుక్కపై ప్రస్తుతం అక్కడి శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు.

మరో వైపు ఇది కుక్కనా లేదా ఒకప్పటికి తోడేలా అనేది కూడా ప్రస్తుతం వారి మనసును తొలుస్తున్న ప్రశ్న.