18 సంవత్సరాలు పైబడిన వారికి కూడా వ్యాక్సిన్.. ఎప్పటి నుండి అంటే..??

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే.దీంతో చాలా రాష్ట్రాలలో కరోనా బారిన పడిన వాళ్లకి వైద్యం అందని పరిస్థితి.

 18 Years Holders Also Eligible For Vaccine India, Corona Vaccine, Covid Cases, C-TeluguStop.com

పరిస్థితి ఇలా ఉండగా కరోనా నియంత్రణ చేయాలంటే కచ్చితంగా వ్యాక్సిన్ కొరత తీర్చాలని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని గత కొంత కాలం నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాయి.వ్యాక్సిన్ వేయించే విషయంలో ఎక్కడ కూడా వయస్సు పరిమితి పెట్టకుండా చూడాలని కేంద్రాన్ని కోరడం జరిగింది.

ఇదిలా ఉంటే తాజాగా మే ఫస్ట్ నుండి 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ అందించడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగింది.ఇండియాలో సెకండ్ వేవ్ ఉదృతంగా ఉండటంతో .చాలావరకూ యూత్ వల్ల ఇంటిలో ఉన్న పెద్ద వాళ్ళు కరోనా బారిన పడటంతో.కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ప్రస్తుతం దేశంలో 45 సంవత్సరాలు పైబడిన వాళ్లకి వ్యాక్సిన్ అందిస్తున్నారు.ఇదిలా ఉంటే మే ఫస్ట్ నుండి మాత్రం 18 సంవత్సరాలు పైబడినవారు వ్యాక్సిన్ వేయించుకోవాలి అంటూ తాజాగా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube