3 నెలలుగా ప్రియురాలి ఇంట్లో రహస్యంగా ప్రియుడు, విషయం తెలిసిన తల్లి ఏం చేసిందో తెలుసా?

అమెరికాలో ప్రేమలు డేటింగ్‌లు అనేవి చాలా కామన్‌.అక్కడ అమ్మాయిలు చాలా ధైర్యంగా తాము ప్రేమించిన వారిని ఇంటికి కూడా తీసుకు వెళ్లేంత స్వేచ్చ ఉంటుంది.

 18 Years Boy Secretly Lived Attic 14 Year Old Girls Bedroom 1-TeluguStop.com

కాని కొన్ని చోట్ల మాత్రం అమ్మాయిల తల్లిదండ్రులు అందుకు ఒప్పుకోరు.తన తల్లిదండ్రులు ప్రియుడు ఇంటికి వచ్చేందుకు ఒప్పుకోక పోవడంతో 14 ఏళ్ల బాలిక తన ప్రియుడును రహ్యంగా పిలిచి ఏకంగా మూడు నెలల పాటు ఇంట్లోనే ఉంచుకుంది.

ఈ సంఘటన టెన్నెస్సీలో జరిగింది.

-Telugu NRI

పూర్తి వివరాల్లోకి వెళ్తే… టెన్నెస్సీకి చెందిన 14 ఏళ్ల బాలిక 18 ఏళ్ల మాథ్యూ అనే కుర్రాడిని ప్రేమించింది.ఆ కుర్రాడికి కొన్ని కారణాల వల్ల షెల్టర్‌ లేకుండా పోయింది.దాంతో అతడికి తన ఇంట్లోనే ఆశ్రయం ఇవ్వాలని ఆ బాలిక భావించింది.

ప్రతి రోజు చీకటి పడ్డ తర్వాత అమ్మాయి గదికి ఉన్న సెకండ్‌ డోర్‌ ద్వారా ఇంట్లోకి ప్రవేశించేవాడు.అలా మూడు నెలల పాటు ఇంట్లో ఎవరికి తెలియకుండానే అతడు ఇంట్లో ఉంటూ వచ్చాడు.

ఒక రోజు రాత్రి పొద్దు పోయిన తర్వాత బాలిక తల్లి ఇంటికి వచ్చింది.అప్పటికి మాథ్యూ ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు.

-Telugu NRI

అతడిని చూసిన బాలిక తల్లి ఎవరు అంటూ ప్రశ్నిస్తున్నా కూడా ఆమె రూంలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు.తలుపు ఎంతగా బాదినా కూడా ఆ అమ్మాయి కాని మాథ్యూ కాని తలుపు తీయలేదు.దాంతో పోలీసులకు ఆమె ఫోన్‌ చేసి పిలిపించింది.అయిదు నిమిషాల్లో వచ్చిన పోలీసులు బలవంతంగా తలుపులు తెరిపించారు.అతడిని అదుపులోకి తీసుకున్నారు.అతడి వివరాలను సేకరించాడు.

ఆ అమ్మాయితో ప్రేమలో ఉన్నట్లుగా అతడు చెప్పాడు.ఇది లవ్‌ వ్యవహారంగా పరిగణించిన కోర్టు స్వల్ప మొత్తంలో జరిమానా విధించి విడుదల చేయడం జరిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube