మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నిఖిల్  

Nikhil 20 Movie in rainbow Reels Banner, Tollywood, 18 roses Movie, Karthikeya 2, Telugu Cinema - Telugu 18 Roses Movie, Karthikeya 2, Nikhil 20 Movie In Rainbow Reels Banner, Telugu Cinema, Tollywood

రెగ్యులర్ చిత్రాలకి భిన్నంగా డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న నటుడు నిఖిల్.అతను చేసిన సినిమా అంటే కచ్చితంగా కాన్సెప్ట్ ఒరియాంటెడ్ తోనే ఉంటుంది అనే ఒక అభిప్రాయం ప్రేక్షకులలో ఉంది.అందుకు తగ్గట్లుగానే అతని సినిమాలు ఎంపిక కూడా ఉంటుంది.ప్రస్తుతం ఈ కుర్ర హీరో లాక్ డౌన్ టైంలోనే తన ప్రియురాలిని పెళ్లి చేసుకొని ఒక ఇంటివాడు అయ్యాడు.

 18 Roses Movie Karthikeya 2 Nikhil

ఇక తన కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన కార్తికేయ సినిమాకి సీక్వెల్ ని ఎనౌన్స్ చేశాడు.ఇక ఈ సినిమా అతని కెరియర్ లో భారీ బడ్జెట్ చిత్రంగా ఉండబోతుంది.

ఏకంగా ఈ సినిమాని 25 కోట్లని నిర్మిస్తున్నారు.చందూ మొండేటి మరోసారి ఈ సినిమా కథకి పురాణాలు టచ్ ఇచ్చి థ్రిల్లర్ గా ఆవిష్కరించడానికి రెడీ అవుతున్నాడు.

మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నిఖిల్-Movie-Telugu Tollywood Photo Image

ఇక సుకుమార్ కథతో గీతా ఆర్ట్స్ లో పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ ఒక లవ్ స్టోరీ సినిమా చేస్తున్నాడు.18 రోజెస్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఇక ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ఈ సినిమా ఉండబోతుంది.ఇది కూడా ఇప్పటికే ఓపెనింగ్ అయిపోయింది.ఇదిలా ఉంటే తాజాగా నిఖిల్ పుట్టిన రోజు సందర్భంగా మరో ప్రాజెక్ట్ ని అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు.ఏషియన్ సినిమాస్, రెయిన్ బో రీల్స్ బ్యానర్ పై ఒక సినిమాకి ఒకే చెప్పాడు.

ఈ సినిమా కూడా నిఖిల్ కెరియర్ లో మరో భారీ బడ్జెట్ చిత్రంగా ఉండబోతుందని నిర్మాతలు తెలియజేశారు.త్వరలో ఈ సినిమా దర్శకుడితో పాటు ఇతర వివరాలు తెలియజేస్తామని ప్రకటించారు.

#18 Roses Movie #Karthikeya 2

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

18 Roses Movie Karthikeya 2 Nikhil Related Telugu News,Photos/Pics,Images..