బాబోయ్ మరో అంతుచిక్కని వ్యాధి.. 18 మంది మృతి!  

18 people deceased of unknown disease in odisha, Odisha, Coronavirus, Bodo Antiga Village, New Virus, Fever, Motions, Vomtings, Doctors, - Telugu Bodo Antiga Village, Coronavirus, Doctors, Fever, Motions, New Virus, Odisha, Vomtings

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది.ప్రతిరోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి.

TeluguStop.com - 18 People Diceased Unknown Disease In India

కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.అయితే ఇదే సమయంలో దేశంలో కొత్త వ్యాధులు విజృంభిస్తున్నాయి.

ఒరిస్సాలోని నవరంగపూర్‌ జిల్లాలో కొత్త రోగం శరవేగంగా ప్రబలుతోంది.

TeluguStop.com - బాబోయ్ మరో అంతుచిక్కని వ్యాధి.. 18 మంది మృతి-General-Telugu-Telugu Tollywood Photo Image

జిల్లాలోని కొశాగుమడ సమితిలోని బొడొ అటిగాం గ్రామంలో గడిచిన వారం రోజుల నుంచి గుర్తు తెలియని వ్యాధుల బారిన పడి ప్రజలు చనిపోతున్నారు, గడిచిన మూడు, నాలుగు రోజుల్లో ఏకంగా 18 మంది మృతి చెందారంటే ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో సులభంగా అర్థమవుతుంది.

ప్రజలు ఎందుకు చనిపోతున్నారో కూడా గ్రామస్థులకు అర్థం కావడం లేదు. దీంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు.

వ్యాధి ప్రబలిన గ్రామంలో ప్రస్తుతం 760 కుటుంబాలు ఉన్నాయి.వ్యాధి బారిన పడిన వారికి మొదట జ్వరం వస్తుంది.

ఆ తర్వాత వారిలో వాంతులు, విరోచనాలు లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి.వ్యాధి బారిన పడి చనిపోయిన వారిలో సంవత్సరం పిల్లల నుంచి 50 సంవత్సరాల ముసలి వాళ్ల వరకు ఉండటం గమనార్హం.

అయితే ఇంత మంది మృతి చెందినా ఆ గ్రామానికి ఇప్పటికీ వైద్య బృందం రాకపోవడం గమనార్హం.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ గ్రామంపై దృష్టి పెట్టి వ్యాధి ప్రబలడానికి గల కారణాలను గుర్తించాల్సి ఉంది.

ఈ వ్యాధికి ఏదైనా వైరస్, బ్యాక్టీరియా కారణం ఐతే వ్యాధి ఇతర ప్రాంతాలకు కూడా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి.ప్రభుత్వం సరైన సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వైరస్ మరింత వ్యాధి మరింత ప్రబలి ప్రజలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది.

మరోవైపు వ్యాధుల వల్ల ఈ సంవత్సరమంతా ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

#Motions #Vomtings #New Virus #BodoAntiga #Doctors

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

18 People Diceased Unknown Disease In India Related Telugu News,Photos/Pics,Images..