నిఖిల్ కూడా తగ్గేదేలే అంటున్నాడుగా.. 18 పేజెస్ కలెక్షన్స్ ఎంతంటే?

టాలీవుడ్ లో పండుగల సమయంలో వరుస సినిమాలను రిలీజ్ చేయడం ఆనవాయితీగా వస్తుంది.ఇక 2022 క్రిస్మస్ బరిలో కూడా చాలానే సినిమాలు రిలీజ్ అయ్యాయి.

 18 Pages Box Office Collections , Nikhil Siddharth, Karthikeya 2, 18 Pages, Suku-TeluguStop.com

మరి ఆ సినిమాల్లో ‘’18 పేజెస్” కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాల్లో ఒకటి.ఈ సినిమా మౌత్ టాక్ బాగా వచ్చింది.

అలాగే రివ్యూలు కూడా పాజిటివ్ రావడంతో ఈ సినిమాను యూత్ బాగానే ఆదరిస్తున్నారు.

గత సినిమా కార్తికేయ 2 తోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నిఖిల్ ఇప్పుడు 18 పేజెస్ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

కుమారి 21F సినిమా ఫేమ్ డైరెక్టర్ సూర్య ప్రతాప్ పల్నాటి తెరకెక్కించిన ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కథ అందించాడు.ఇక ఈ సినిమాలో కూడా కార్తికేయ 2 జోడీనే కనిపించారు.

ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 పై బన్నీ వాసు నిర్మించగా.మ్యూజిక్ డైరెక్టర్ గా గోపి సుందర్ సంగీతం అందించాడు.

ఈ సినిమాకు రిలీజ్ కు ముందే మంచి హైప్ ఉండడంతో థియేట్రికల్ రైట్స్, మిగతా రైట్స్ అన్ని కలుపుకుని అప్పుడే పెట్టిన బడ్జెట్ తిరిగి వచ్చినట్టు సమాచారం.ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి 10 రోజులు గడిచింది.

ఈ క్రమంలోనే ఈ సినిమా ఎన్ని కలెక్షన్స్ రాబట్టింది అనే విషయాన్నీ మేకర్స్ అఫిషియల్ పోస్టర్ తో అనౌన్స్ చేసారు.ఈ సినిమా 10 రోజుల్లో 25 కోట్లను క్రాస్ చేసింది.రిలీజ్ అయిన ఫస్ట్ డే కంటే ఈ సినిమా తర్వాతనే ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది.కమర్షియల్ సినిమా కాకపోయినా ఈ రేంజ్ లో ఆదరణ లభించడం గ్రేట్ అనే చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube