వామ్మో... 18 కోట్ల పాన్ కార్డులపై వేటు పడనుందా..?!

గత రెండు సంవత్సరాల నుండి ఆధార్ కార్డు తో పాన్ కార్డు లింకు చేయాలని కేంద్ర ప్రభుత్వం అనేక సార్లు గడువును పెంచుతూ వస్తూనే ఉంది.ఇకపోతే తాజాగా చిట్ట చివరి సారిగా పాన్ కార్డు ఉన్న వారు ఆధార్ తో లింకు చేసుకోవడానికి మార్చి 31, 2021 లోగ అనుసంధానం చేసుకోవాలని భారతదేశ ఐటీ శాఖ ఇప్పటికే తెలియజేసింది.

 Govt To Suspend 18 Crore Pan Cards  Not Linked To Aadhaar, Pan Card Link With Aa-TeluguStop.com

ఇక అసలు విషయంలోకి వెళితే… ఇంకా అనేక మందికి పాన్ కార్డు కు, ఆధార్ కార్డుతో లింకు లేవని ఐటీ శాఖ తెలియజేసింది.అది కూడా ఏకంగా 18 కోట్ల పైగానే పాన్ కార్డ్ వినియోగదారులు ఆధార్ కార్డు తో జత చేసుకోలేదని తెలియజేశారు.

ఒకవేళ ఐటీ శాఖ ఇచ్చిన సమయం లోపల వారు ఆధార్ కార్డుతో లింకు చేసుకోకపోతే పాన్ కార్డులను నిర్వీర్యం చేస్తామని ఐటీశాఖ తెలియజేసింది.అయితే ముఖ్యంగా ఇలా చేయడానికి గల కారణం… చాలామంది ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డు లను ఉపయోగించేవారు ఉన్నారని, పన్ను ఎగవేతలకు, అధిక మొత్తం లో లావాదేవీలు చేసేవారిని గుర్తించే పనిలో ఉన్నట్టు ఐటి అధికారులు చెబుతున్నారు.

ఇకపోతే అనేకమంది ఆధార్ కార్డు తో పాన్ కార్డును లింకు చేయకుండా అనేక లావాదేవీలను కొనసాగిస్తున్నారని, కొందరు రెండు పాన్ కార్డులు ఉపయోగించి పన్ను ఎగవేసేటట్లు వారికి సమాచారం వచ్చిందని తెలిపారు.

Telugu Aadhar, Central, Suspendcrore, Tax, Officials, Pan, Pan Aadhar, Pan Cards

ఇందుకోసమే ఇన్ కమ్ టాక్స్ అధికారులు ఒక పాన్ కార్డు కు, ఒక ఆధార్ కార్డు లింక్ చేస్తే ఒక మనిషి ఒక పాన్ కార్డు కంటే ఎక్కువ ఉపయోగించలేడని వెల్లడించారు.ఆ విషయం కారణంగానే అనేక మంది వెనకడుగు వేస్తున్నట్లు అధికారులు తెలుపుతున్నారు.ఇలా లింకు చేయడం ద్వారా ఒక వ్యక్తి తన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, క్రెడిట్ కార్డులు వంటి వ్యవస్థల ద్వారా జరిపే లావాదేవీలను గుర్తించవచ్చని ఐటీ శాఖ చెప్పుకొచ్చింది.

ఇక ఈ విషయంపై ఇన్ కమ్ ట్యాక్స్ శాఖ మరింత దృష్టి పెట్టబోతోంది.ఈ నేపథ్యంలో స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ వారి సహాయంతో పాన్ కార్డు ను ఆధార్ లింకు చేయని వ్యక్తులను గుర్తించవచ్చని అధికారులు తెలియజేస్తున్నాను.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube