వ్యవసాయానికి ఉపయోగపడే రోబో..17 ఏళ్ల కుర్రాడి అద్భుత సృష్టి...

వ్యవసాయానికి సాయం చేయాలనే ఆలోచనే స్ఫూర్తిగా తీసుకున్న 17 ఏళ్ల కుర్రాడు ఒక గొప్ప అద్భుతం సృష్టించాడు.ప్రోటో టైప్స్ ఆఫ్ సాయిల్ టెస్టింగ్ రోబో అగ్రి బోట్ ను రూపొందించాడు.

 Mangaluru Boy Sarthak Develops Prototype Robot 'agribot' To Facilitate Farmers,-TeluguStop.com

ఈ అగ్రి బోట్ వ్యవసాయానికి ఎంతో గానో ఉపయోగ పడే విధంగా ఉంది.ఈ రోబో ముఖ్యంగా భూమిలోని తేమ శాతాన్ని, ఉష్ణోగ్రతను, భూమిలోని సారాన్ని తెలియజేస్తుంది.

ఈ పరీక్ష కోసం అది పొలం లోని వివిధ ప్రదేశాల్లో మట్టి శాంపిల్స్ ను సేకరిస్తుంది.ఈ పరీక్ష వల్ల రైతులు పొలంలో ఏ పంట వేస్తే దిగుబడి బాగా వస్తుందో తెలుసుకోగలుగుతారు.

సార్తిక్ కుమార్.కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరులో కొళియాల్ బలి ప్రాంతంలో ఎక్స్పర్ట్ పి యు కాలేజ్ లో రెండో సంవత్సరం ఇంటర్మీడియట్ చదువుతున్నాడు.సార్తిక్ చిన్నప్పటినుండి టెక్నాలజీ అంటే చాలా ఆసక్తి చూపేవాడు.ఆ అబ్బాయికి వయసుతో పాటు ఆసక్తి కూడా పెరిగింది.

ఎప్పుడూ ఏదో ఒకటి చేయాలనే తపనతో ఉండేవాడు.రోబోటిక్స్, అల్గారిథమ్స్, 3డీ మోడలింగ్, హాకింగ్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వంటి అనేక విషయాలపై సార్థిక్ కు ఎంతో ఆసక్తి.

దానికి తోడు పంట పండించే సమయంలో రైతులు పడుతున్న కష్టాలు సార్తిక్ ను ప్రభావితం చేశాయి.దాంతో ఎలాగైనా వ్యవసాయానికి ఉపయోగపడే టెక్నాలజీని తయారు చేయాలని నిర్ణయం తీసుకున్నాడు.

ఆ సమయంలో సాయిల్ టెస్టింగ్ పై అతడి దృష్టి పడింది.రైతులు పంట పండించడానికి మట్టిని పరీక్ష చేయించడం ఎంతో అవసరం.

మట్టి పరీక్ష చేయించాలంటే అధికారులు పొలంలోకి వచ్చి, మట్టిని తీసుకెళ్లి మట్టి పరీక్ష చేసి వాటి ఫలితాలను ఇవ్వడానికి చాలా సమయం పడుతుంది.దీనివల్ల పంటకు అదును తప్పే అవకాశం ఉంది, కాబట్టి ఎలాగైనా దీనికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో సార్తిక్ ఈ అగ్రి బోటును తయారుచేయడానికి పూనుకున్నాడు.

ఈ అగ్రి బోట్ ఒక మొబైల్ యాప్ తో కనెక్ట్ అయి ఉంటుంది.పొలంలో సేకరించిన సమాచారాన్నంతా క్షణాల్లో ఆ అప్లికేషన్ కు పంపుతుంది.అంతేకాక దీన్ని పూర్తిగా అప్లికేషన్ సాయంతో నడపవచ్చు.ఎక్కడి నుంచి శాంపిల్స్ సేకరించాలి? ఏ స్థాయిలో సేకరించాలి? సేకరించిన శాంపిల్స్ లో తేమ శాతాన్ని ,ఉష్ణోగ్రత స్థాయిని, సారాన్ని గుర్తించి వాటి వివరాలను అందజేస్తుంది.ఆ విధంగా వచ్చిన వివరాలను అప్లికేషన్ లోకి ఇంటర్ఫేస్ అనలైజ్ చేసి,భూమి ఏ పంట పండించేందుకు అనుకూలంగా ఉందో రైతుకు తెలియజేస్తుంది.అంతే కాకుండా పంటలు పండించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా సూచిస్తుంది.

ఈ అగ్రి బోట్ తయారు చేయడం పై సార్ధిక్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.రైతులకు ఈ అగ్రి బోట్ బాగా ఉపయోగ పడుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది అంటున్నాడు.

ఈ ప్రోటోటైప్ ను నేను మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు నా ఇద్దరు స్నేహితులతో కలిసి తయారు చేశానని తెలియజేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube