టిక్ టాక్ చేయొద్దని చెప్పినందుకు ఓ యువతి ఏకంగా....

ప్రస్తుత కాలంలో కొందరు టిక్ టాక్ సోషల్ మీడియా మద్యమానికి ఎంతగా బానిస అయ్యారంటే చివరికి టిక్ టాక్ వీడియోలను చేయొద్దని చెప్పినందుకు గాను ఏకంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.తాజాగా ఓ యువతికి తన కన్నతల్లి టిక్ టాక్ వీడియోలు చేయడం మాని చదువుకొమ్మని చెప్పినందుకుగాను ఆ యువతి ఏకంగా ఆత్మ హత్య చేసుకుని తన కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపిన ఘటన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగర పరిసర ప్రాంతంలో చోటు చేసుకుంది.

 Crime News, Girl Suicide, Hyderabad, Telangana, Tik Tok-TeluguStop.com

వివరాల్లోకి వెళితే స్థానిక నగరంలోని రామంతపూర్ పరిసర ప్రాంతంలో 17 సంవత్సరాలు కలిగినటువంటి ఓ యువతి నివాసముంటోంది.అయితే ఈ యువతి కుటుంబ సభ్యులు కుటుంబ పోషణ నిమిత్తమై నగరంలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చే వాళ్ళు.

కాగా యువతి మాత్రం తరచూ టిక్ టాక్ వీడియోలు చూస్తూ  కాలక్షేపం చేసేది.ఈ క్రమంలో యువతి తల్లి ఇటీవలే యవతిని టిక్ టాక్ వీడియోలు చేయొద్దని, బుద్దిగా చదువుకోవాలని  మందలించింది.

దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన టువంటి యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

విషయం తెలుసుకున్న టువంటి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు మృతదేహాన్ని దగ్గర ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు.

అలాగే పిల్లల తల్లిదండ్రులకు కూడా తమ పిల్లల్ని కొంతమేర సోషల్ మీడియా మాధ్యమాలకి దూరంగా ఉంచాలని సూచించారు.ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీ జనరేషన్ లో ఎక్కువ మంది చిన్నపిల్లలు సోషల్ మీడియా మాధ్యమాలకి బానిస అవుతున్నారని కాబట్టి వారిని పసితనం నుంచే కొంతమేర సోషల్ మీడియా మాధ్యమాలకు దూరంగా ఉంచితే మానసిక వత్తిడులకు లోనుకాకుండా ఉంటారని కూడా పలువురు వైద్య నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube