వావ్.. కరోనా మహమ్మారిని ఖతం చేసే హైటెక్ మాస్క్ కనుగొన్న 17 ఏళ్ల అమ్మాయి..!

దేశంలో లాక్ డౌన్, కర్వ్యూ పెట్టడం వల్ల చాలా మంది యువత ఆన్ లైన్ క్లాసులు వింటూ ఇంట్లోనే ఉంటున్నారు.ఇటువంటి పరిస్థితుల్లో ఓ యువతి చేసిన పనికి గూగుల్ ప్రశంసల జల్లు కురిపిస్తోంది.

 17 Years Girl Found Hi Tech Mask To Kill Corona Virus-TeluguStop.com

పశ్చిమ బెంగాల్ కు చెందిన 17 ఏళ్ల అమ్మాయి కరోనాను అంతం చేసే హైటెక్ మాస్క్ ను తయారు చేసింది.ఆ అమ్మాయి చేసిన పనికి గూగుల్ శెభాష్ అంటూ హర్షం వ్యక్తం చేసింది.

బెంగాల్ కు చెందిన దిగాంతిక బోస్ అనే17 ఏళ్ల యువతి ఇంటర్ చదువుతోంది.సైంటిస్టు కావాలనే లక్ష్యంతో ముందుకెళుతోంది.

 17 Years Girl Found Hi Tech Mask To Kill Corona Virus-వావ్.. కరోనా మహమ్మారిని ఖతం చేసే హైటెక్ మాస్క్ కనుగొన్న 17 ఏళ్ల అమ్మాయి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇంత చిన్న వయస్సులోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుని కరోనా వైరస్ నిరోధక ఇన్ హేలార్ మాస్క్‌ను తయారు చేసింది.బెంగాల్ లోని తూర్పు బుర్ద్వాన్‌కు చెందిన దిగాంతిక బోస్ ఆవిష్కరణను గూగుల్ సైతం గుర్తించింది.

ప్రపంచంలోని పది స్ఫూర్తిదాయకమైన డిజైన్లలో ఈ మాస్కును చేర్చి దిగాంతికను గూగుల్ ప్రశంసించింది.

హైటెక్ మాస్కు వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి.

దిగాంతిగా వాటి వివరాలను తెలియజేసింది.గాలిలో ఉండే వైరస్‌ను గుర్తించే నెగిటివ్ అయాన్, దాన్ని పూర్తిగా ఈ హైటెక్ మాస్కు నాశనం చేస్తుంది.

అయితే ఈ మాస్కు అన్ని రకాల వైరస్‌లను నిర్వీర్యం చేయకపోవచ్చు.ఈ మాస్కు తయారీలో బ్యాటరీతో నడిచే సర్క్యూట్‌, రెండు ఫిల్టర్ ట్యూబ్‌లు, సబ్బు నీటిని ఉపయోగించానని మాస్కులోని వ్యవస్థ పనితీరును దిగాంతిక తెలిపింది.

బ్యాటరీతో నడిచే సర్క్యూట్ ద్వారా నెగిటివ్ అయాన్లు ఉత్పన్నమవుతాయి.ఇవి మాస్కులోకి వచ్చే గాలిలోని దుమ్ము, వైరస్‌లను నాశనం చేస్తాయి.

అనంతరం సబ్బు నీరు మిగిలిన క్రిములను పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది.మాస్కులో సబ్బు నీరు రెండు ట్యూబ్‌ల మధ్య ఉంటుంది.

మాస్కు ధరించినవారు శ్వాస తీసుకున్నప్పుడు గాలి ట్యూబ్‌ల నుంచి వెళ్తుంది.ఈ క్రమంలో అది సబ్బు నీటితో కాంటాక్ట్ అవుతుంది.

ఫలితంగా గాలిలో మిగిలిన వైరస్‌లు కూడా నాశనం అవుతాయని దిగాంతిక తెలిపింది.

#17 Years Girl #Google #Anti Virus Mask #Creative Mask #Carona Virus

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు