అమెరికా : భారత సంతతి బాలుడికి ప్రతిష్టాత్మక యంగ్ సైంటిస్ట్ అవార్డ్ .. !!

అమెరికాలో 17 ఏళ్ల భారత సంతతి బాలుడికి ప్రతిష్టాత్మక ‘‘ Regeneron Young Scientist Award’’ దక్కింది.mpox వైరస్‌కు సంబంధించిన పరిశోధన చేసినందుకు గాను అతనిని ఈ అవార్డ్ వరించింది.కొలంబియాలోని డేవిడ్ హెచ్ హిక్‌మన్ హైస్కూల్‌కు చెందిన సాథ్విక్ కన్నన్( Sathvik Kannan ) .2022లో mpox వైరస్ ఇన్ఫెక్టివిటీ పెరగడానికి గల కారణలను అర్ధం చేసుకునేందుకు గాను బయో కంప్యూటేషనల్ పద్ధతులను ఉపయోగించాడు.తన విధానానికి బయోప్లెక్స్ అని పేరు పెట్టాడు.

 17 Year Old Indian-american Teen Wins $50,000 Young Scientist Award , Young Scie-TeluguStop.com

ఇది mpox వైరస్( mpox virus ) నమూనా నిర్మాణాలను డీకోడ్ చేయడానికి మెషిన్ లెర్నింగ్, త్రీ డైమెన్షనల్ కంపారిటివ్ ప్రోటీన్ మోడలింగ్ కలయికను ఉపయోగిస్తుంది.

ఇది వైరస్‌లోని ఉత్పరివర్తనాలను గుర్తించడానికి అనుమతిస్తుంది.తన పరిశోధనకు సంబంధించి మిస్సౌరీ యూనివర్సిటీలో వెటర్నరీ పాథోబయాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కమలేంద్ర సింగ్‌ను( Professor Kamalendra Singh ) తన గురువుగా తెలిపాడు.

సాథ్విక్‌కు అవార్డ్ దక్కడంపై కమలేంద్ర హర్షం వ్యక్తం చేశారు.భవిష్యత్తులో ఇతర వైరస్‌ల వ్యాప్తి, పరిశోధనలకు కూడా శాస్త్రవేత్తలు బయోప్లెక్స్‌ను వర్తింపజేస్తారని సాథ్విక్ అభిప్రాయపడ్డారు.

Telugu Young, Indian American, Mpox, Youngscientist-Telugu NRI

ప్రపంచవ్యాప్తంగా 49 రాష్ట్రాలు, 64 దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 1600 మందికి పైగా యువ శాస్త్రవేత్తలు , ఇంజనీర్లు 2023 Regeneron International Science and Engineering Fairలో పోటీపడ్డారు.కంప్యూటేషనల్ బయాలజీ అండ్ బయో ఇన్ఫర్మేటిక్స్‌ విభాగంలో సాథ్విక్ తొలి స్థానంలో నిలిచి 50 వేల డాలర్ల బహుమానం అందుకున్నాడు.ప్రముఖ బయో టెక్నాలజీ సంస్థ రెజెనెరాన్( Biotechnology company Regeneron ) ప్రకారం.సవాల్ చేసే శాస్త్రీయ ప్రశ్నలను పరిష్కరించడంలో, ప్రామాణికమైన పరిశోధన పద్ధతులను ఉపయోగించడం , రేపటి సమస్యలకు పరిష్కారాలను రూపొందించడంలో నిబద్ధత కలిగిన వారిని విజేతలుగా ఎంపిక చేసినట్లు తెలిపింది.

Telugu Young, Indian American, Mpox, Youngscientist-Telugu NRI

పోర్ట్‌ల్యాండ్‌కు చెందిన మరో భారత సంతతి బాలుడు రిషబ్ జైన్.సింథటిక్ డీఎన్ఏ ఇంజనీరింగ్‌ని ఉపయోగించి రీకాంబినెంట్ కోవిడ్ 19 వ్యాక్సిన్‌ల వంటి ఔషధాలను మరింత వేగంగా, తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేయడానికి వీలుగా ఏఐ ఆధారిత మోడల్‌ను అభివృద్ధి చేశాడు.ఇందుకుగాను గతేడాది ఇదే అవార్డ్‌ను గెలుచుకున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube