నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో 17 మంది అభ్యర్థులకు షాకిచ్చిన అధికారులు.. ?

నాగార్జునసాగర్ ఉప ఎన్నిక తెలంగాణ ప్రజల్లో ఊహించని ఉత్కంఠ కలిగిస్తున్నదన్న విషయం తెలిసిందే.అదీగాక రాజకీయ వర్గాల్లో కూడా టెన్షన్ వాతావరణం సృష్టించింది.

 Seventeen Members Nominations Rejected In Nagarjuna Sagar By Polls ,  Nagarjuna-TeluguStop.com

ఈ ఎన్నికను అయితే టీయార్ఎస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

ఇక బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా ఇక్కడ ఖచ్చితంగా గెలుపు తమనే వరిస్తుందనే ధీమాగా ఉన్నారట.

అయితే ఈ సాగర్ ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి.ఒకరకంగా ఈ ఎన్నిక రాజకీయ చదరంగంలా మారిందంటున్నారు.

ఇదిలా ఉండగా బీజేపీ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగిన నివేదిత రెడ్డికి షాక్ తగిలిందట.నివేదిత వేసిన నామినేషన్ తిరస్కరణకు గురైనట్లు సమాచారం.

నామినేషన్లను నిన్న పరిశీలించిన అధికారులు మొత్తం 17 మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారట.

ఇందులో నివేదిత రెడ్డి, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి, మరో 15 మంది స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు ఉన్నట్లుగా తెలుస్తుంది.

ఇక ప్రస్తుతం సాగర్ ఉప ఎన్నికల పోటీలో 60 మంది అభ్యర్థులు మిగిలారు.ఇకపోతే నామినేషన్ల ఉప సంహరణ గడువు ఎల్లుండి వరకు ఉన్న విషయం తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube