15 నిముషాల్లో 17 కిలోమీట‌ర్లు.. ట్రాఫిక్ పోలీసులు, అంబులెన్స్ డ్రైవ‌ర్ మీద ప్ర‌శంస‌ల వెల్లువ‌

లైవ్ ఆర్గాన్స్‌ను సరైన సమయంలో తరలించడం కీలకం.ఇందు కోసం వైద్యులు పోలీసులను సంప్రదిస్తుంటారు.

 17 Kilometers In 15 Minutes Traffic Police, Ambulance Driver Praised, Traffic P-TeluguStop.com

సాధారణంగా మెట్రో నగరాల్లో ట్రాఫిక్ భారీగా ఉంటుంది.ఒక వేళా లైవ్ ఆర్గాన్స్ తరలించే అంబులెన్స్ ట్రాఫిక్‌లో చిక్కుకుంటే ఇక అంతే సంగతులు.

దీంతో సమయం వృథా అయ్యే అవకాశం ఉంటుంది.వీటిని దృష్టిలో ఉంచుకునే పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసి లైవ్ ఆర్గాన్స్‌ను తరలిస్తారు.

ఇందు కోసం ప్రత్యేకంగా గ్రీన్ ఛానల్‌ను ఏర్పాటు చేస్తారు.

లైవ్ ఆర్గాన్స్‌ను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించాల్సి ఉంటుంది.

ఇందుకు కోసం దగ్గరి మార్గాన్ని పోలీసులు ఎంచుకుంటారు.ఆ మార్గం మొత్తం ట్రాఫిక్ క్లియర్ చేసి వీలైనంత త్వరగా డెస్టినేషన్ ఆసుపత్రికి అంబులెన్స్ వెళ్లేలా ఏర్పాట్లు చేస్తారు.

తాజాగా బ్రెయిన్ డెడ్ అయిన ఓ వ్యక్తి అవయమాలను తరలించడానికి పోలీసులు మరోసారి గ్రీన్ ఛానల్‌ను వినియోగించారు.

ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రిలో ఓ వ్యక్తి చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయ్యాడు.

దీంతో అతని గుండె, ఊపిరితిత్తులను బేగంపేట్‌లోని కిమ్స్ ఆసుపత్రికి గ్రీన్ ఛానల్ ద్వారా తక్కువ సమయంలో తరలించారు.ముందుగా ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రి నుంచి బేగంపేట్ కిమ్స్ ఆసుపత్రి రూట్లో ట్రాఫిక్ క్లియర్ చేశారు.

వెంటనే ఆంబులెన్స్‌లో లైవ్ ఆర్గాన్స్‌ను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.గ్రీన్ ఛానల్ ద్వారా కేవలం 15 నిమిషాల్లోనే లైవ్ ఆర్గాన్స్‌ను తరలించారు.

ఎల్బీనగర్ నుంచి బేగంపేట్‌కు దాదాపు 20 కిలో మీటర్ల దూరం ఉంటుంది.సాధారణంగా ఈ రూట్‌లో ప్రయాణించాలంటే దాదాపు రెండు గంటలు సమయం పడుతుంది.

ఇక ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.మరీ, లైవ్ ఆర్గాన్స్ ను వీలైనంత త్వరగా తరలించాల్సి ఉంటుంది.

ఇందు కోసం పోలీసులు ముందుగానే ట్రాఫిక్ క్లియర్ చేసి గ్రీన్ ఛానల్ ద్వారా అతి తక్కువ సమయంలో లైవ్ ఆర్గాన్స్ తరలిస్తుంటారు.కొన్ని సందర్భాల్లో మెట్రో రైలును కూడా వినియోగించిన దాఖలాలు కూడా ఉన్నాయి.

Police Arranges Green Channel For Live Organs Transport

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube