బయటపడిన 1,650 ఏళ్ల క్రితం నాటి వైన్.. ఇప్పటికీ తాగేందుకు సేఫ్ అట!

సాధారణంగా ఆల్కహాల్ ( Alcohol ) అంటేనే హానికరం.ఇక ఏళ్లకొద్దీ పాచిపోయిన ఆల్కహాల్ మరింత హాని చేస్తుంది.

 1650 Years Oldest Wine Bottle Found In Germany Still Safe To Drink Details, Anci-TeluguStop.com

కానీ ప్రత్యేక పద్ధతిలో సంరక్షించిన ఒక వైన్‌ను వేల సంవత్సరాల తర్వాత తాగినా ఆరోగ్యానికి ఎలాంటి హాని కలగదు.వివరాల్లోకి వెళితే.150 సంవత్సరాల క్రితం పరిశోధకుల అన్వేషణలో 1867 కాలం నాటి ఒక వైన్ బాటిల్( Ancient Wine ) దొరికింది.జర్మన్ నగరమైన స్పేయర్‌లో( Speyer ) జరిపిన పురావస్తు శాస్త్రవేత్తల తవ్వకంలో పురాతన రోమన్ కళాఖండాలు బయటపడ్డాయి.

క్రీస్తు శకం 325-359 సంవత్సరాల మధ్య భద్రపరిచిన వీటిలో 16 సీసాలు, సంపద ఉంది.

అయితే గడిచిన 1500 ఏళ్లలో ఇతర సీసాలు దెబ్బతిన్నాయి లేదా ధ్వంసమయ్యాయి, ఒకటి మాత్రం చెక్కుచెదరకుండా ఉంది.శతాబ్దాల నాటి మురికి, ధూళి అంటుకుపోవడం వల్ల ఇది చాలా ఘోరంగా కనిపించింది.అయినా ఇందులోని వైన్ ఇప్పటికీ తాగవచ్చని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.

ఎందుకంటే రోమన్లు ​​​​ఆ వైన్‌ను సంరక్షించడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతిని అనుసరించారట.వారు సీసాలు మూసివేయడానికి ఆలివ్ నూనెను ఉపయోగించారు.

అలాగే ఆ సీసాలోని గాలిని బయటికి పోగొట్టారు.ఫలితంగా సీసాలోని వైన్ వినెగార్‌గా మారకుండా, సంవత్సరాలుగా అభివృద్ధి చెందింది.

నేడు, ఈ సీసాలో మిగిలి ఉన్నది స్పష్టమైన, ఆల్కహాల్ లేని ద్రవం, దానితో పాటు రోసిన్‌ను పోలి ఉండే ఘన పదార్థం.వైన్ పూర్తిగా చెడిపోదని నిపుణులు అంటున్నారు.వైన్ ప్రొఫెసర్ మోనికా క్రిస్ట్‌మాన్ ఈ వైన్ గురించి మాట్లాడుతూ ద్రవం సూక్ష్మ జీవశాస్త్రపరంగా చెడిపోకపోయినా, రుచి భయంకరంగా ఉంటుందని, సీసాని తెరిచే రిస్క్ చేయకూడదని హెచ్చరిస్తున్నారు.అయితే రుచి బాగోలేకపోయినా దీనిని తాగిన తర్వాత ఎలాంటి హాని జరగదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube