గూగుల్‌కు పోటీ ఇస్తున్న టీనేజర్‌  

Google Beware ! -

గూగుల్‌కు పోటీ ఇచ్చాడు ఓ పదహారేళ్ల కురాడ్రు.అతను భారత సంతతికి చెందిన కెనడా దేశపు పౌరుడు.

జస్‌్ట పదో తరగతి పాసయ్యాడు.కాని గూగుల్‌ సెర్చ్ ఇంజిన్‌కు పోటీగా తాను ఒక సెర్చ్ ఇంజిన్‌ తయారుచేశాడు.

Google Beware -General-Telugu-Telugu Tollywood Photo Image

ఏ సమాచారాన్ని అయినా సెకన్లలో మనకు అందించే గూగూల్‌ కంటే ఈ కుర్రాడు తయారుచేసిన సెర్‌్చ ఇంజిన్‌ నలభైఏడు శాతం ఆక్యురేట్‌గా పనిచేస్తుందట.అన్‌మోల్‌ టక్రెల్‌ అనే ఈ కురాడ్రు తన సెర్‌్చ ఇంజిన్‌ను కేవలం కొన్ని నెలల్లో రూపొందించాడు.

ప్రపంచవ్యాప్తంగా గూగుల్‌ నిర్వహించిన ఆన్‌లైన్‌ వైజ్ఞానిక ప్రదర్శనలో అన్‌మోల్‌ తన సెర్‌్చ ఇంజిన్‌ ప్రదర్శించాడు.ఈ సైన్‌్స ఫేర్‌లో పదమూడేళ్ల నుంచి పద్దెనిమిది ఏళ్ల వయసు లోపున్నవారే పాల్గొనాలి.

బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో రెండు వారాల ఇంటర్‌్నషిప్‌ చేయడం కోసం ఇతను ప్రస్తుతం ఇండియాకు వచ్చాడు.ఈ తరం యువతీ యువకుల్లో మెరికల్లాంటివారు ఎందరో ఉన్నారు.

వారు ఆధునిక టెక్నాలజీ రహస్యాలను అందిపుచ్చుకుంటున్నారు.పెద్ద కంపెనీలు చేసే పనులను వీరు చేసి ఆశ్చర్యపరుస్తున్నారు.

గూగుల్‌కు పోటీ ఇచ్చేలా సెర్‌్చ ఇంజిన్‌ తయారు చేసిన ఈ కుర్రాడు ఇంటర్‌్నషిప్‌కు బెంగళూరుకు రావడం ఆశ్చర్యకరమే.అతని మూలాలు భారతలోనే కదా ఉన్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు