నాడు దోషులు, నేడు నిర్దోషులు

మీరట్ లో జరిగిన అల్లరుల్లో సాయుధ పోలీసులు 16 మంది విచక్షణ లేకుండా 42మంది ముస్లింలను కాల్చిపారెసిన దుస్సంఘటన లో యూపి సర్కార్ సిఐడి విచారణ జరిపించింది.1996లో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేస్తూ 16మందిని దోషులుగా పేర్కొంది.25ఏళ్ళ తరవాత కోర్టు విచారణలో ఎలాంటి ఆధారాలు లభ్యం కానందున సాక్ష్యాలు సరిగ్గా లేనందున 16మందిని నిర్దోషులుగా గుర్తించినేడు కోర్టు విడిచిపెట్టేసింది.1987లో మీరట్ జిల్లాలో అల్లర్లు భారీ హింసను రక్తపాతాన్ని సృష్టించాయి మే 22న హాశింపురా గ్రామంలోకి సాయుధ కానిస్టేబుళ్ల(పీఏసీ) మసీదు వద్ద గుమిగూడిన 50 మంది ముస్లింలను వాహనంలో ఎక్కించుకుని అందరు చూస్తుండగా వెళ్ళారు ఆ తర్వాత వారిని తుపాకులకు ఎరచేసి ఓ కాలువలో కుప్పగా పడేశారు.ఈ మానవ హోమంలో మొత్తం 42 మంది తుపాకీ గుళ్ళకు హతమయ్యారు దీనిపై విచారణ జరిపిన సి ఐ డి అధికార్లు 17 మందిని నిందితులుగా పేర్కొన్నారు.2002లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు ఢిల్లీ కోర్టుకు బదిలీ అయింది.ఇన్నేళ్ల విచారణ జరుగుతుండగా నిందితుల్లో ఒకరు తీవ్ర అనారోగ్యంతో చనిపోయారు.161 మంది సాక్షులను కోర్టు విచారించింది .తుది తీర్పు లో నిందితులందరినీ నిర్దోషులుగా వదిలేసింది.

 16 Policemen Acquitted In 1987 Meerut Massacre Case-TeluguStop.com
Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube