ఇండో అమెరికన్ కి 16 నెలల జైలు శిక్ష..!!!  

16 Months Arrest For Indo American-

అమెరికాలో సంచలనం సృష్టించిన కాల్సెంటర్ స్కీం కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన ఇండో అమెరికన్ కి 16 నెలల జైలు శిక్ష విధించింది అమెరికా కోర్టు.ఈ కుంభకోణంలో దాదాపు 340 మందికి పైగా బాధితులు ఉన్నారని వారికి రెండు లక్షల డాలర్లకు పైగా నష్టం జరిగిందని పోలీసులు తెలిపిన వారాలని పరిశీలించిన కోర్టు ఈ తీర్పుని విధించింది..

16 Months Arrest For Indo American--16 Months Arrest For Indo American-

భారత్‌లోని కాల్ సెంటర్ల నుంచి జరిగిన ఈ భారీ కుంభకోణంలో “మెహబూబ్ మన్సూర్ అలీ చరానియా” పాలు పంచుకున్నాడని అమెరికా న్యాయ విభాగం తెలిపింది.కాల్ సెంటర్ ఆపరేటర్లు అమెరికా వాసులకి కాల్ చేసి ఇతరుల ఖాతాల్లోకి డబ్బు పంపేలా వారిని తప్పుదారి పట్టించారని, ఐఆర్‌ఎస్ (ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్) అధికారులుగా నిందితులు వారు నాటకం ఆడారని కోర్టు ధృవీకరించింది.

ఈ వ్యవహారంలో చరానియ అతడి నేరాన్ని ఒప్పుకోవడంతో జనవరి 17న అతడిని దోషిగా నిర్ధారించారు.అయితే బుధవారం అతనికి న్యాయస్థానం 16 నెలల జైలు శిక్ష విధించడంతోపాటు బాధితులకు 2,03,958 డాలర్లు తిరిగి ఇవ్వాలని తీర్పు చెప్పింది.