మారిన నిబంధనలు: ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయిన ఇండో-అమెరికన్లు, చివరికి

రద్దు చేసిన పాత పాస్‌పోర్టులు వెంట తీసుకురాని కారణంగా 16 మంది ఇండియన్ అమెరికన్లు ఆదివారం అమెరికాలోని జాన్ ఎఫ్ కెనడీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.భారత విదేశాంగ శాఖ తెలిపిన కొత్త తాత్కాలిక నిబంధనల ప్రకారం.

 16 Indian Americans Briefly Stranded At Jfk Airport-TeluguStop.com

బాధితులు తమ పాత రద్దు చేసిన పాస్‌పోర్ట్ వివరాలను ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డులో పొందుపరచాల్సి ఉంటుంది.

అలాగే భారతదేశం జీవితకాల పరిమితితో ఇచ్చే ఓసీఐ కార్డు నిబంధనల ప్రకారం… 20 ఏళ్ల లోపు, 50 ఏళ్ల పైబడిన వారు తమ పాస్‌పోర్ట్‌ను రెన్యువల్ చేయించుకున్న ప్రతీసారి ఓసీఐ కార్డును సైతం రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది.

అయితే 2020 జూన్ 30 వరకు సవరించిన నిబంధనల ప్రకారం ఓసీఐ కార్డుదారులు తమ పాస్‌పోర్ట్‌ను తమతో పాటు భారతదేశానికి తీసుకెళ్లాల్సి ఉంటుంది.అయితే ఈ కొత్త నిబంధనల గురించి చాలా మంది ఓసీఐ కార్డుదారులకు తెలియకపోవడం వారిని చిక్కుల్లో పడేస్తోంది.

Telugu Johnkennedy, Cancelled, Validoci-

ఇదే సమయంలో ఆదివారం జరిగిన ఘటనను పరిశీలిస్తే.ఈ 16 మంది ఇండో-అమెరికన్ ప్రయాణీకులందరూ చెల్లుబాటయ్యే ఓసీఐ కార్డును తీసుకెళ్తునప్పటికీ.పాత పాస్‌పోర్టులు లేవు.దీని కారణంగా వీరి బోర్డింగ్ పాస్‌లను ఎయిరిండియా సిబ్బంది ప్రాసెస్ చేయలేకపోయారు.అయితే బాధితులు వెంటనే ఈ విషయాన్ని ఇండియన్ అంబాసిడర్ హర్షవర్థన్ ష్రింగ్లా, న్యూయార్క్‌లోని కౌన్సుల్ జనరల్ సందీప్ చక్రవర్తి, ఎయిరిండియా నార్త్ అమెరికా హెడ్ కమల్ రౌల్‌ల దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో విమానం బయలుదేరడానికి కొద్ది నిమిషాల ముందు సందీప్ చక్రవర్తి ఎయిరిండియాకు ఈమెయిల్ చేయడంతో వారిని ప్రయాణానికి అనుమతించారు.

ఆ 16 మంది ప్రయాణికులు చెల్లుబాటయ్యే అమెరికా పాస్‌పోర్టులు, ఓసీఐ కార్డులు కలిగి వున్నందున ప్రయాణానికి అనుమతించాలని చక్రవర్తి ఈ మెయిల్‌లో పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube