కరోనా వైరస్ వ్యాప్తి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యాపించి ప్రపంచదేశాలను వణికించేస్తోంది.
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల పది లక్షలమందికిపై కరోనా వ్యాపించింది.ఇంకా అందులో కోటి 40 లక్షలమంది కరోనా నుండి కోలుకోగా 7 లక్షలమందికిపైగా కరోనా వైరస్ కి బలయ్యారు.
ఇంకా ఈ కరోనా కు రెండు రోజుల క్రితమే వ్యాక్సిన్ వచ్చింది.అయితే కరోనా వైరస్ కారణంగా మనిషి జీవనం పూర్తిగా మారిపోయింది.బయటకు వెళ్తే చాలు మాస్కు, శానిటైజర్ తప్పనిసరి.సోషల్ డిస్టెన్స్ తప్పని సరి.అయితే సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నారు కానీ కరోనా వైరస్ వ్యాపిస్తుంది.
ఈ విషయంపై పరిశోధకులు ఒక గమ్మతైనా విషయం బయటకు చెప్పారు.అదేంటంటే? సాధారణంగా ఆరు అడుగులు దూరం ఉంటే చాలు కరోనా సోకదు అని చెప్పేవారు.కానీ ఇప్పుడు కరోనాకు బలం పెరిగింది.
అందుకే ఇప్పుడు ఆరు కాదు పదహారు అడుగులు దూరంలో ఉన్న కరోనా వ్యాపిస్తుంది.
ఈ విషయాన్నీ అమెరికా ఫ్లోరిడా విశ్వవిద్యాలయానికి చెందిన వైరాలజీ నిపుణులు చెప్పారు.
చిన్నచిన్న తుంపర్లు, దగ్గు ద్వారా గాలిలోకి ప్రవేశిస్తున్న కరోనా వైరస్ కి ఆరు అడుగులలో వారికి వ్యాపించడం పెద్ద కష్టం కాదని, 16 అడుగుల వరకు మనిషి దూరం ఉంటేనే కరోనా వ్యాప్తి చెందాదని వారి సర్వేలో తేలింది.