15 లక్షల మంది ఎన్నారైలు..రికార్డ్ సృష్టించిన భారత ప్రభుత్వం..!!!

భారత ప్రభుత్వం రికార్డ్ సృష్టించింది.విదేశాలలో చిక్కుకుపోయి ఎన్నో కష్టాలు పడుతూ, ఆర్ధికంగా, మానసికంగా కష్టాలు పడుతున్న ఎంతో మంది భారతీయులని అక్కున చేర్చుకుంది.

 Over 15 Lakh Repatriated Under Vande Bharat Mission, Vande Bharat Mission-6, Ind-TeluguStop.com

మన దేశానికి రండంటూ ఆప్యాయంగా ఆహ్వానం పలికింది.ఇందుకు వందే భారత్ మిషన్ ఏర్పాటు చేసి ఎన్నారైల కళ్ళల్లో వెలుగులు నింపింది.

కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది భారతీయులు వివిధ దేశాలలో చిక్కుకుని పోయారు.చాలా మంది ఉద్యోగాలు కోల్పవడమే కాకుండా ఆర్ధికంగా చితికి పోయారు…దాంతో

ఎన్నారైలు అందరూ తమని భారత్ తీసుకువెళ్ళమని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయగా సానుకూలంగా స్పందించిన కేంద్రం వందే భారత్ మిషన్ ఏర్పాటు చేసింది.

పలు దఫాలుగా ఎన్నారైలను ప్రత్యెక విమానాల ద్వారా భారత్ తీసుకురావడమే కాకుండా వారిని వారి సొంత ప్రాంతాలకి తరలించడంలో కూడా ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసింది.అత్యధికంగా అమెరికా నుంచీ పెద్ద ఎత్తున ఎన్నారైలు భారత్ వచ్చినట్టుగా కేంద్రం ప్రకటించింది.ప్రస్తుతం

వందే భారత్ మిషన్ – 6 కొనసాగుతోంది.ఈ మిషన్ లో భాగంగా సెప్టెంబర్ 5 వ తేదీన వివిధ దేశాల నుంచీ సుమారు 4 వేల మంది భారతీయ ఎన్నారైలు భారత్ చేరుకోగా.

ఈ మిషన్ మొదలైన నాటి నుంచీ నేటి వరకూ సుమారు 15 లక్షల మంది భారతీయులు భారత్ చేరుకున్నట్టుగా తెలుస్తోంది.అయితే ఇందులో సుమారు 5 లక్షల మంది విమానాల ద్వారా స్వదేశానికి చేరుకోగా, 10 లక్షల మంది వివిధ రకాలుగా భారత్ చేరుకున్నారని విమానయాక శాఖామంత్రి గురుప్రీత్ సింగ్ ప్రకటించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube