తెలంగాణా పోలీసులను కలవరపెడుతున్న కరోనా, ఏకంగా 155 మందికి...!

దేశంలోని తెలంగాణా రాష్ట్రంలో కరోనా కోరలు చాపుతున్న సంగతి తెలిసిందే.ఈ మహమ్మారి నివారణలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేస్తున్న పోలీసులను ఇప్పుడు కరోనా కలవరపెడుతుంది.

 155 Policemen Infected Coronovirus In Greater Hyderabad , Coronavirus, Hyderabad-TeluguStop.com

పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 155 మంది కి పాజిటివ్ సోకడం కలవరపెడుతుంది.ఇప్పటివరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏకంగా 155 మంది ఈ వైరస్ బారినపడ్డారు.

పోలీస్ డిపార్ట్ మెంట్ లో పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఉన్నతాధికారులు అప్రత్తమయ్యారు.కరోనా లక్షణాలు ఉన్నవాళ్లు విధులకు హాజరవొద్దని.

ఇంటి దగ్గరే రెస్ట్ తీసుకోవాలని సూచిస్తున్నారు.

కుల్సుపురా పోలీస్ స్టేషన్ కు చెందిన ఒక కానిస్టేబుల్ మే 20న కరోనా బారినపడి చనిపోయిన సంగతి తెలిసిందే.

దీనితో ప్రస్తుతం పాజిటివ్ వచ్చిన పోలీసులు అందరూ కూడా భయాందోళనకు గురువుతున్నారు.మరోపక్క రోజురోజుకు పోలీసుశాఖలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆందోళన మొదలైంది.

ప్రజలను కాపాడే ప్రయత్నంలో వీరంతా కరోనా బారినపడినట్లు తెలుస్తోంది.ఒక్క బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఏకంగా 15 మంది పోలీసులకు కరోనా సోకింది.

వారం రోజుల నుంచి సిటీలో జరుపుతున్న కరోనా టెస్టుల ద్వారా ఇవన్నీ బయటపడుతున్నాయి.తాజాగా సోమవారం 20 మంది పోలీసులకు కరోనా కన్ఫర్మ్ అయింది.

సిటీలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ మూడు కమిషనరేట్ల పరిధిలో ఇప్పటివరకు 155 మంది పోలీసులకు సోకినట్లు అధికారులు స్పష్టం చేశారు.కరోనా పాజిటివ్ తేలిన వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ మహమ్మారి సోకే అవకాశం ఉండడం తో వారందరినీ కూడా క్వారంటైన్ చేసి అందరికీ టెస్టులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

అలానే కరోనా సోకిన పోలీసుల కోసం గాంధీ ఆస్పత్రిలో స్పెషల్ వార్డును ఏర్పాటు చేశారు.కోల్డ్, ఫీవర్, కఫ్ లక్షణాలు ఉన్నవారికి మాత్రమే ఇక్కడ చికిత్స అందిస్తున్నారు.

ఈ లక్షణాలు లేనివారికి నేచర్ క్యూర్ ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నారు.పాజిటివ్ వచ్చిన పోలీస్ స్టేషన్లలో డిసింన్ఫెక్ట్స్ స్ప్రే చేసి శానిటైజ్ చేస్తున్నట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube