ద్యావుడా : అక్కడ ఒక్క రోజులోనే 150 కోట్ల రూపాయల మందు తాగేసారంట... 

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలను గ్రీన్,ఆరెంజ్ మరియు రెడ్ జోన్ల వారిగా విభజిస్తూ కరోనా ప్రభావం తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మద్యం అమ్మకాలకు అనుమతులు జారీ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఇందులో భాగంగా తమిళనాడు రాష్ట్రంలో గ్రీన్ మరియు ఆరెంజ్ జోన్లలో మద్యం అమ్మకాలు చేపట్టాలని ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాలకు ఆదేశాలు జారీ చేసింది.

 Alcohol Consumption, 150 Crore Rupees, Tamilnadu, Liquor Profits, Tamilnadu Govt-TeluguStop.com

దీంతో ఒక్కసారిగా మద్యం బాబులు మరియు మద్యం సేవించేటువంటి మహిళలు మద్యం దుకాణాలకి భారీగా క్యూ కడుతున్నారు.

అయితే తాజాగా స్థానిక రాష్ట్రానికి చెందినటువంటి అబ్కారీ అధికారులు తెలిపినటువంటి మద్యం ద్వారా వచ్చినటువంటి ఆదాయాలను పరిశీలిస్తే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 150 కోట్ల రూపాయలు మద్యం అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది.

దీంతో దాదాపుగా దేశంలో మద్యం అమ్మకాలు చేపట్టిన మొదటి రోజే ఇంత ఆదాయం రావడం ఇదే మొదటిసారి.అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతం మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.

ఇప్పటి వరకూ రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయలు ఆదాయం ప్రభుత్వానికి చేకూరినట్లు సమాచారం.దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం అమ్మకాలను అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 75 శాతం రేట్లు పెంచినప్పటికీ మద్యం అమ్మకాల్లో జోరు మాత్రం తగ్గడం లేదు.

దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా ప్రస్తుతం మద్యం ఆదాయంతో బాగానే కళకళలాడుతోంది.

ఈ విషయం ఇలా ఉండగా గత నలభై రోజులుగా దేశంలో కరోనా వైరస్ పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని ఎప్పుడైతే మద్యం అమ్మకాలు చేపట్టారో అప్పటి నుంచి ప్రజలు సామాజిక దూరం పాటించడం మానేశారని దీనివల్ల భవిష్యత్తులో ప్రమాదం ఎదుర్కోవాల్సి ఉంటుందని కాబట్టి వెంటనే మద్యం అమ్మకాలను నిలిపివేయాలంటూ పలువురు ప్రజా సంఘ నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు.

మరోవైపు తాజాగా సుప్రీంకోర్టు మద్యం అమ్మకాలను ఆన్ లైన్ ద్వారా చేపట్టి వినియోగదారుల ఇంటికి సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేసే యోచన చేస్తున్నట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube