చనిపోవడానికి అనుమతి కోరిన 15 ఏళ్ల బాలుడు! అసలు కారణం ఏంటంటే  

15-year-old Seeks Permission To Die From President-

తల్లిదండ్రుల ప్రభావం పిల్లలపైన ఎ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.చిన్న వయసులో తల్లిదండ్రులని చూసి పిల్లలు అన్ని విషయాలు నేర్చుకుంటారు.వారి ఆలనలో ప్రపంచం గురించి తెలుసుకుంటారు..

15-year-old Seeks Permission To Die From President--15-year-old Seeks Permission To Die From President-

తాను ఎవరితో ఎలా ఉండాలో నేర్చుకుంటారు.మరి అలాంటి చిన్న వయస్సు పిల్లల ముందు తల్లిదండ్రులు గొడవ పడితే ఆ ప్రభావం వారి మనసుల మీద ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఒకరిని ఒకరు ద్వేషించుకునే తల్లిదండ్రులని చూస్తూ పెరిగే పిల్లలు కూడా అయితే అలాగే తయారవుతారు.

లేదంటే సమాజానికి దూరంగా, బంధాలు మీద, మనుషుల మీద గౌరవం పోయి ఒంటరిగా బ్రతాలని అనుకుంటారు.ఇప్పుడు ఓ 15 ఏళ్ల పిల్లాడు తల్లిదండ్రుల గొడవలు చూసి తట్టుకోలేక చనిపోవడానికి పర్మిషన్ ఇవ్వాలని రాష్ట్రపతికి లేఖ రాసాడు.ఇప్పుడు ఈ లేఖ సంచలనంగా మారింది.

బాలుడి తండ్రి జార్ఖండ్‌లోని దియోఘర్‌లో స్టేట్ రూరల్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లో మేనేజర్‌గా పని చేస్తున్నాడు.

తల్లేమో బీహార్ రాజధాని పాట్నాలో ఓ బ్యాంకు మేనేజర్‌గా పని చేస్తుంది.అయితే క్యాన్సర్‌తో బాధపడుతున్న తండ్రిని అతని తల్లి తరుచుగా వేధింపులకి గురి చేయడం, బయట వ్యక్తులని తీసుకొచ్చి తండ్రి మీద దాడి చేయడం, ఇష్టానుసారంగా మాట్లాడటం, ఇతర వ్యక్తులతో వివాహేతర సంబంధం పెట్టుకొని కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరగడం చూసి 15 ఏళ్ల కుర్రాడు తట్టుకోలేకపోయాడు.చిన్న వయసులో తాత దగ్గర పెరిగిన బాలుడు తరువాత ఉన్నత విద్య కోసం తండ్రి దగ్గరకి వచ్చాడు.బాలుడు తల్లిపై ఆమె అత్తింటి వారు నిందలు మోపడంతో, దానిని ఆమె భర్త కూడా కొనసాగించడంతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది.

ఇద్దరు వివాహేతర సంబంధాలకి అలవాటు పడ్డారు.ఇక ఆ బాలుడుని కనీసం పట్టించుకోకుండా వదిలేసారు.ఇక తల్లిదండ్రుల గొడవలు చూసి తట్టుకోలేకపోయిన బాలుడు ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని రాష్ట్రపతికి దరఖాస్తు చేసుకున్నాడు.

దీంతో రాష్ట్రపతి పోలీసులకి విషయం చేరవేరి లేఖపై చట్టపరంగా చర్యలు తీసుకొని తల్లిదండ్రులతో మాట్లాడాలని ఆదేశించారు.