సామూహిక వివాహాలు చేసుకున్న ట్రాన్స్ జెండర్స్!

ట్రాన్స్ జెండర్స్ ని ఇప్పటి వరకు అందరూ హిజ్రాలు అనే ముద్ర వేసి సమాజంలో వారో అంటరానివారుగా మూడో జాతిగా చూస్తూ వచ్చారు.వీళ్ళని ఉత్సవాలలో, పెళ్లి వేడుకలో డాన్స్ లు చేయడానికి మాత్రమే పనికొచ్చే వారుగా అందరూ చూస్తారు.

 15 Transgender Couples Tie Knot In Raipur Mass Wedding-TeluguStop.com

అలాంటి వారిని తమలో కలుపుకోవడానికి, ట్రాన్స్ జెండర్ మహిళగా మారిన వారిని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకి రారు.దీంతో వారు వ్యభిచారం, బిక్షాటన వృత్తిగా తీసుకొని బ్రతుకుతూ ఉంటారు.

ఇండియాలో చాలా వరకు ట్రాన్స్ జెండర్ ల పరిస్థితి ఇప్పటికి ఇలాగే ఉంది.

అయితే విదేశీయుల స్ఫూర్తితో చాలా మంది భారతీయ ట్రాన్స్ జెండర్స్ వాళ్ళ హక్కుల కోసం చాలా కాలంగా పోరాటం చేస్తున్నారు.

వారిని థర్డ్ జెండర్ గా గుర్తించి సుప్రీం కోర్ట్ తీర్పు చెప్పడం జరిగింది.ఇదిలా ఉంటె తాజాగా ట్రాన్స్ జెండర్స్ సామూహిక వివాహ వేడుక ఛత్తీస్ గడ్ రాజధాని రాయ్ పూర్‌లో జరగడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

ఈ వేడుకలో వివిధ రాష్ట్రాలకి చెందిన మొత్తం 15 మంది అబ్బాయిలని పెళ్ళిళ్ళు చేసుకొని వివాహబంధంలోకి అడుగుపెట్టారు.ఈ సామూహిక వివాహాలను చిత్రగాహి సినిమా నిర్మాత సొంత ఖర్చుతో జరిపించారు.

సామాజిక కార్యకర్త విద్యా రాజ్ పుత్‌తో పాటు ఇతరులు వేడుకల ఏర్పాట్లు చేశారు.ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube