భార‌తీయులుగా మ‌నం ఎప్ప‌టికీ క‌చ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అత్యంత ముఖ్య‌మైన 15 ఘ‌ట‌న‌లు ఇవే.!  

15 Points To Remember About The India-

భిన్న‌త్వంలో ఏక‌త్వం ఉన్న దేశం మ‌న‌ది. ఎందుకంటే మ‌న దేశంలో ఎన్నో కులాలు, మ‌తాలు ఉన్నప్ప‌టికీ భార‌తీయులుగా అంద‌రం క‌లిసే ఉన్నాం. సంతోషం వ‌చ్చిన‌ప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాం..

భార‌తీయులుగా మ‌నం ఎప్ప‌టికీ క‌చ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అత్యంత ముఖ్య‌మైన 15 ఘ‌ట‌న‌లు ఇవే.!-15 Points To Remember About The India

దుఃఖం వ‌చ్చిన‌ప్పుడు అంద‌రం క‌ల‌సి బాధ‌ప‌డుతున్నాం. దేశానికి చెందిన ఏ విష‌యాన్నయినా మ‌నంద‌రం క‌లిసే షేర్ చేసుకుంటున్నాం. అయితే అలా షేర్ చేసుకున్న ప‌లు ముఖ్య‌మైన సంఘ‌ట‌న‌లు గ‌తంలో అనేకం జ‌రిగాయి.

మ‌రి వాటిలో మ‌న మ‌నస్సుల‌ను బాగా హ‌త్తుకున్న, మ‌న‌కు క‌న్నీళ్లు తెప్పించిన‌, ఆనందం క‌లిగించిన సంఘ‌ట‌న‌లు ఏమిటో ఇప్పుడు చూద్దామా.!

1. స్వాతంత్ర్యం

ఆ రోజున యావ‌త్ జాతి మొత్తం ఎంతో ఆనంద ప‌డిన రోజు. ప్రతి ఒక్క‌రు హ‌ర్షించిన రోజు. గ‌ర్వంతో త‌ల ఎత్తుకున్న రోజు.

3. గోధా ట్రెయిన్

2002 ఫిబ్ర‌వ‌రి 27న గోధా ట్రెయిన్ సంఘ‌ట‌న‌. ఇంకా మ‌న క‌ళ్ల ముందు కదులుతుంది. ఎన్నో జీవితాలు అగ్ని కీల‌ల‌కు బుగ్గి అయ్యాయి.

యావ‌త్ దేశ ప్ర‌జ‌లు ఖండించిన ఘ‌ట‌న అది.

4. ఇండియా-పాకిస్థాన్ విభ‌జ‌న

ప్రపంచ వ్యాప్తంగా జ‌రిగిన అతి పెద్ద వ‌ల‌స‌ల్లో ఇండియా-పాకిస్థాన్ విభ‌జ‌న సంద‌ర్భంగా జ‌రిగిన వ‌ల‌స ముఖ్య‌మైంది. విభ‌జ‌న సంద‌ర్భంగా జ‌నాలు అటు నుంచి ఇటుకు, ఇటు నుంచి అటుకు వెళ్లారు..

ఆ సంద‌ర్భంలో చాలా మంది ఇబ్బందుల‌కు గుర‌య్యారు. ఇది కూడా భార‌తీయులు గుర్తుంచుకోవాల్సిన ఓ ఘ‌ట‌న‌.

5. జ‌లియ‌న్ వాలా బాగ్

1919 ఏప్రిల్ 13న జ‌రిగిన జ‌లియ‌న్ వాలా బాగ్ ఘ‌ట‌న గురించి తెలియ‌ని వారుండ‌రు. బ్రిటిష్ ప్ర‌భుత్వం చేసిన అత్యంత హేయ‌మైన చ‌ర్య‌ల్లో ఇది అతి చాలా ముఖ్య‌మైంది..

అంద‌రూ గుర్తుంచుకోవాల్సింది.

6. డాక్ట‌ర్ ఏపీజే అబ్దుల్ క‌లాం

మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు గాంచిన డాక్ట‌ర్ ఏపీజే అబ్దుల్ క‌లాం చ‌నిపోయిన‌ప్పుడు బాధ‌ప‌డ‌ని భార‌త పౌరుడు ఉండ‌రు. నిజంగా ఆయ‌న నేడు మ‌న మ‌ధ్య లేడంటే ఆ లోటు స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది..

7. గాంధీ మ‌ర‌ణం

యావ‌త్ దేశ ప్ర‌జ‌ల‌ను క‌ల‌చివేసిన ఘ‌ట‌న‌ల్లో గాంధీ మ‌ర‌ణం కూడా ఒక‌టి. 1948 జ‌న‌వ‌రి 30న ఆయ‌న హ‌త్య‌కు గుర‌య్యారు. దేశ ప్ర‌జ‌ల‌ను శోక సంద్రంలో ముంచి వెళ్లిపోయారు..

8. క‌ల్ప‌నా చావ్లా

మ‌హిళా వ్యోమ‌గామిగా క‌ల్ప‌నా చావ్లా దేశ ఖ్యాతిని న‌లు దిక్కుల‌కు వ్యాపింప జేశారు..

అయితే ఆమె అకాల మ‌ర‌ణం దేశ ప్ర‌జ‌ల‌ను శోక సంద్రంలో ముంచింది.

9. ఆర్మీ

దేశాన్ని ర‌క్షించండ కోసం ఎంతో మంది సైనికులు ఉగ్ర‌వాదుల తూటాల‌కు బ‌ల‌య్యారు. అలాంటి వారిని మ‌నం ఎప్పుడూ గుర్తుంచుకుంటాం..

అయితే ముఖ్యంగా మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్ మృతిని మాత్రం భార‌తీయులుగా మ‌నం ఇప్ప‌టికీ త‌ట్టుకోలేకుండా ఉన్నాం. నిజంగా ఆయ‌న మృతిని, దేశానికి చేసిన సేవ‌ను అంద‌రూ గుర్తుంచుకోవాలి.

10. ఇందిరాగాంధీ

ఇందిరాగాంధీ హ‌త్య‌కు గురైన‌ప్పుడు యావ‌త్ దేశం షాక్‌కు గురైంది..

ప్ర‌జ‌లు విషాదంలో మునిగిపోయారు. ఆమె మృతిని ప్ర‌తి భార‌తీయుడు గుర్తుంచుకోవాలి.

11. నిర్భ‌య ఘ‌ట‌న

దేశ రాజ‌ధాని ఢిల్లీలో ప‌బ్లిగ్గా ఓ బ‌స్సులో ఓ యువ‌తిపై కొంద‌రు మృగాళ్లు సాగించిన దారుణ అత్యాచార కాండ‌ను ఎవ‌రూ మ‌రువ‌లేరు..

నిజంగా ఇలాంటి ఘ‌ట‌న‌ల‌ను అంద‌రూ గుర్తు పెట్టుకోవాలి. భ‌విష్య‌త్తులో మ‌రే మ‌హిళ‌కు ఇలా జ‌ర‌గ‌కుండా చూడాలి.

12. భోపాల్ గ్యాస్

మ‌ధ్య‌ప్ర‌దేశ్ భోపాల్ గ్యాస్ ఉదంతాన్ని ఇప్ప‌టికీ ఎవ‌రూ మ‌రిచిపోలేదు..

ఎంతో మంది విష‌వాయువుల బారిన ప‌డి ప్రాణాలొదిలారు. ప్ర‌తి భార‌తీయుడు ఈ ఘ‌ట‌న‌ను గుర్తుంచుకుంటాడు.

13. 26/11 ముంబై దాడులు

14. ఉత్త‌రాఖండ్ వ‌ర‌ద‌లు

ఉత్త‌రాఖండ్‌లో వ‌చ్చిన వ‌ర‌ద‌ల్లో ఎంతో మంది చ‌నిపోయారు. ఎన్ని రోజులు గ‌డిచినా, సంవ‌త్స‌రాలు పూర్త‌యినా ఈ దుర్ఘ‌ట‌న‌ను అంద‌రూ గుర్తు పెట్టుకుంటారు.

15. లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి మ‌ర‌ణం

ఆయ‌న మృతిని ఎవ‌రూ త‌ట్టుకోలేరు. ఆయ‌న అకాల మ‌ర‌ణం అంద‌రినీ షాక్‌కు గురి చేసింది. ఆ ఘ‌ట‌నను కూడా అంద‌రూ గుర్తు పెట్టుకోవాల్సిందే..