త్వరలో జనసేనానికి బిగ్ షాక్...15 మంది జంప్..???

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి త్వరలో బిగ్ షాక్ తగలనుందా.??? అందుకు తగ్గట్టుగానే జగన్ పక్కా వ్యూహంతో చక్రం తిప్పనున్నాడా…?? జగన్ ఇవ్వనున్న షాక్ తో పవన్ అభిమానులు జగన్ వెంట నడవబోతున్నారా.?? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.పవన్ అభిమానులు జగన్ వెంట ఎలా నడుస్తారు.

 15 Members Jump From Janasena Shock To Pawan-TeluguStop.com

అసలు జగన్ ,పవన్ కళ్యాణ్ కి ఇవ్వబోయే షాక్ ఏమిటి.??? అనే వివరాలలోకి వెళ్తే జనసేనాని మైండ్ బ్లాక్ అయ్యే వ్యూహం ఒకటి వైరల్ అవుతోంది.విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.జగన్ ఓ పక్కా వ్యూహాన్ని అమలు చేయనున్నారని తెలుస్తోంది.అదేంటంటే.

ఇప్పటి వరకూ పవన్ కళ్యాణ్ పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలలో అభ్యర్ధులని ప్రకటిస్తూ వచ్చాడు, పొత్తుల ద్వారా కొన్ని స్థానాలు వామపక్షాలు, బీఎస్పీ లకి వెళ్ళిపోయాయి.

అయితే మిగలిన స్థానాలలో అభ్యర్ధులని ఎంపిక చేస్తున్న సమయంలోనే జనసేన విశాఖ నుంచీ లోక్ సభకి ఎంపిక చేసిన గేదెల శ్రీను బాబు పవన్ కి ఊహించని షాక్ ఇస్తూ జగన్ పంచన చేరారు.అయితే ఇది జస్ట్ సాంపిల్ మాత్రమేనని అసలు సినిమా ముందు ముందు ఉంటుందని వైసీపీ వర్గాల చెవులు కొరుక్కుంటున్నాయి.

ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ లోపాయికారీ ఒప్పందం చేసుకుని టీడీపీ తో కలిసి రాజకీయాలు చేస్తూ జనసేన బలంగా ఉన్న చోట్ల టీడీపీ కి కలిసోచ్చేలా డమ్మీలని పెడుతూ వస్తోందని వైసీపీ అధినేత గమనించారో.ఒక్క సారిగా తన వ్యుహలకి పదును పెట్టారట.అందులో భాగంగానే గేదెల శ్రీను బాబు వైసీపీలో చేరారు.ఇలా అతి త్వరలో పవన్ నిలబెట్టిన అసెంబ్లీ స్థానాలలో కీలక అభ్యర్ధులు 15 మంది జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారట.

అయితే మొదటి విడతలో 5 మంది అభ్యర్ధులు చేరుతారని మిగిలిన వారు ఒక్కొక్కరుగా చేరిపోతారని టాక్ విన్పిస్తోంది.దాంతో ఒక్క సారిగా ఏపీలో రాజకీయం మారిపోనుందని తెలుస్తోంది.అయితే వారందరూ వైసీపీలోకి వెళ్ళే ముందు టీడీపీ కి జనసేనకి మధ్య ఉన్న లాలూచిని మీడియా సమావేశంలో బయటపెట్టి మరీ వెళ్లనున్నారని దాంతో జనసేన అభిమానులు, కార్యకర్తల్లో సైతం పవన్ అనుమానాలు రావడం ఖాయమని అంటున్నారు.

ఇప్పటికే జనసేన అభ్యర్ధుల ఎంపిక విషయంలో ఎన్నో సందేహాలు వ్యక్తం చేస్తున్న అభిమానులు ఈ మొత్తం వ్యవహారంతో జనసేనని విడిచి జగన్ వెంట నడవటం ఖాయమని అంచనాలు వేస్తున్నారు.ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ టీడీపీ తో కలిసి వైసీపీ ని దెబ్బకొట్టాలని అనుకున్న ప్లాన్ రివర్స్ లో జనసేనని ఇరికిచేలా ఉందని విశ్లేషిస్తున్నారు.మరి ఈ వార్తల్లో ఎంతవరకూ నిజం ఉందో తెలియదు కాని, ఇదే నిజమైతే పవన్ కళ్యాణ్ ప్యాకప్ చెప్పేయడం బెటర్ అంటున్నారు విశ్లేషకులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube