అబ్బాయికి 15 లక్షల పరిహారం... ఆ రేప్ కేసు కారణం!

అసలు ఈ సమాజంలో ఏం జరుగుతుందో ఎవరికీ అంతుచిక్కకుండా ఉంది.సాధారణంగా మనం తరచూ అమ్మాయిలను మోసం చేసిన అబ్బాయిలను గురించి వింటున్నాం.

 15 Lakh Compensation For Boy The Reason For That Rape Case-TeluguStop.com

అబ్బాయిల పై కేసు నమోదు శిక్ష పడడం వినే ఉంటాం.కానీ ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా ఓ అమ్మాయి ఓ యువకుడిపై తప్పుడు రేప్ కేసు పెట్టి అతనిని జైలుపాలు చేసింది.

దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం అతడిని నిర్దోషిగా తేలడంతో అతనికి విముక్తి కల్పించి అమ్మాయి కుటుంబానికి 15 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని విధించిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది.పూర్తి వివరాల్లోకి వెళితే….

 15 Lakh Compensation For Boy The Reason For That Rape Case-అబ్బాయికి 15 లక్షల పరిహారం… ఆ రేప్ కేసు కారణం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తమిళనాడుకు చెందిన సంతోష్ అనే ఓ వ్యక్తి ఇల్లు, ఆ అమ్మాయి కుటుంబం రెండు పక్క పక్కనే ఉండేవి.ఇరు కుటుంబాలు ఒకే సామాజిక వర్గానికి చెందినవి కావడం వల్ల సంతోష్ కు, అమ్మాయికి వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు.

కానీ కొన్ని ఆస్తి వివాదాల వల్ల ఇరు కుటుంబాల మధ్య గొడవలు తలెత్తడంతో సంతోష్ కుటుంబం అక్కడి నుంచి వెళ్ళి మరొక ప్రాంతంలో నివసిస్తున్నారు.అదే సమయంలో ఆ యువతి గర్భం దాల్చడంతో అందుకు కారణం సంతోష్ అని చెప్పడంతో అమ్మాయి తల్లిదండ్రులు తన కుమార్తెను వివాహం చేసుకోవాలని సంతోష్ నిలదీశారు.

అయితే తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పడంతో అతనిపై అత్యాచార కేసు నమోదు చేశారు.

దీంతో 2009 నవంబర్లో సంతోష్ ను పోలీసులు అరెస్ట్ చేసి దాదాపు 95 రోజుల పాటు కస్టడీలో ఉంచారు.

చివరికి 2010 ఫిబ్రవరి 12న బెయిల్ పై సంతోష్ విడుదలయ్యాడు.అప్పటికే ఆ యువతి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

అయితే తన కూతురు కి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించగా తనకు సంతోష్ కి ఎటువంటి సంబంధం లేదని తెలియడంతో, ఆ యువతి కుటుంబంపై సంతోష్ పరువు నష్టం దావా కేసు వేశాడు.అందుకు గాను అతనికి 30 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని కోర్టును ఆశ్రయించాడు.

ఈ విషయంపై సుదీర్ఘ విచారణ చేపట్టిన న్యాయస్థానం తాజాగా ఆ యువకుడి పై తప్పుడు అత్యాచారం కేసు పెట్టినందుకు గాను అమ్మాయి కుటుంబం సంతోష్ కి పదిహేను లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది.దీంతో చేసేదేమీలేక అమ్మాయి తరపు కుటుంబం సంతోష్ కి 15 లక్షల రూపాయలు నష్ట పరిహారం చెల్లించింది.

#Chennai Girl #Rs30 #FiledA #15Lakh #False Case

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు