రెపరెపలాడిన 15 కిలోమీటర్ల జాతీయ జెండా!  

15 Kilometers Flag Show In Chhatisghar-

ఒకటికాదు రెండు కాదు ఏకంగా 15 కిలోమీటర్ల మువ్వన్నెల జెండా ను ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ లో ప్రదర్శించారు.అక్కడి స్వచ్ఛంద సంస్థ అయిన వసుధైవ్ కుటుంబం ఫౌండేషన్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తుంది.ఆగస్టు 15 న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలుస్తుంది.అయితే ఈ కార్యక్రమంలో దాదాపు మొత్తం 35 స్వచ్ఛంద సంస్థలు కలిసి దీనిలో పాలుపంచుకున్నట్లు సమాచారం.ఆ స్వచ్ఛంద సంస్థలు అన్ని కూడా కలిసి అమపార చౌక్‌ నుంచి పండిట్‌ రవిశంకర్‌ శుక్లా యూనివర్సిటీ వరకు ఈ 15 కిలోమీటర్ల జాతీయ జెండాను ప్రదర్శించారు...

15 Kilometers Flag Show In Chhatisghar--15 Kilometers Flag Show In Chhatisghar-

ఈ 15 కి.మీ.పొడవునా కూడా ఆ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఆయా పాఠశాలల విద్యార్థులు అందరూ కూడా పాల్గొని జాతీయ జెండాను రెపరెపలాడించారు.

ఈ జాతీయ జెండా ప్రదర్శన ఛాంపియన్స్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్ లోకి కూడా ఎక్కినట్లు తెలుస్తుంది.

15 Kilometers Flag Show In Chhatisghar--15 Kilometers Flag Show In Chhatisghar-