చిరంజీవి బాలకృష్ణ ఇప్పటికి ఎన్నిసార్లు తలపడ్డారో ఎవరు గెలిచారో చూడండి   Look Back Into 15 Boxoffice Clashes Of Chiranjeevi And Balakrishna     2017-01-10   02:54:41  IST  Raghu V

ఖైదీనం 150, గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రాలతో, 16వ సారి బాక్సాఫీస్ వద్ద పోటిపడబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ. ఓసారి వీరిద్దరి పోటి చరిత్ర మీద ఓ లుక్కెయ్యండి.

1984 – మంగమ్మ గారి మనవడు vs ఇంటిగుట్టు

ఒక్కరోజులో రెండు సినిమాలు వచ్చాయి. మంగమ్మ గారి మనవడు ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇంటిగుట్టు యావరేజ్. విజేత బాలకృష్ణ.

1984 – శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర vs అగ్నిగుండం

ఆరురోజుల తేడాతో రెండు సినిమాలు వచ్చాయి. ఈసారి కూడా బాలకృష్ణ నెగ్గినా, ఈ సినిమా క్రెడిట్ ఎక్కువగా సీనియర్ ఎన్టీఆర్ కి ఇవ్వాల్సిందే.

1984 – కథానాయకుడు vs రుస్తుం

చిరంజీవి రుస్తుం 7 రోజుల తరువాత విడుదల అయ్యి ఓడిపోయింది.

1985 – చట్టంతో పోరాటం vs ఆత్మబలం

ఒకేరోజు విడుదలయిన ఈ సినిమాల్లో చిరంజీవి చట్టంతో పోరాటం బాలకృష్ణ సినిమాపై పైచేయి సాధించింది.

1986 – భార్గవ రాముడు vs దొంగమొగుడు

రెండు సినిమాలు సమానంగా, సూపర్ గా ఆడాయి. ఈసారి ఇద్దరిలో ఎవరిది పైచేయి కాదు.

1986 – ముద్దుల కృష్ణయ్య vs మగధీరుడు

బాలకృష్ణ ముద్దుల కృష్ణయ్య బంపర్ హిట్ గా నిలవగా, చిరంజీవి సినిమా యావరేజ్ గా నిలించింది.

1986 – నిప్పులాంటి మనిషి vs కొండవీటి రాజా

వారం వ్యవధిలో విడుదలై, రెండు సినిమాలు బాగా ఆడిన, చిరంజీవి కొండవీటి రాజాతో మరింత పెద్ద హిట్ ని సాధించడంతో ఈ పోటి చిరంజీవి ఖాతాలో వేయవచ్చు.

1986 – అపూర్వ సహోదరులు vs రాక్షసుడు

మరోసారి వారం వ్యవధిలో విడుదలయ్యాయి. ఈసారి కూడా రాక్షసుడు చిత్రంతో చిరంజీవి పైచేయి సాధించారు.

1987 – రాము vs పసివాడి ప్రాణం

వారం వ్యవధిలో రెండు సినిమాలు వచ్చి, రెండు బాగా ఆడాయి.

1988 – ఇన్స్పెక్టర్ ప్రతాప్ vs మంచిదొంగ

ఈసారి కూడా ఇద్దరి సినిమాలు సూపర్ గా ఆడాయి.

1997 – పెద్దన్నయ్య vs హిట్లర్

దశాబ్దకాలం తరువాత ఇద్దరు పోటిపడ్డారు. రెండు సినిమాలు బాగా ఆడాయి.

1999 – సమరసింహారెడ్డి vs స్నేహంకోసం

వారం వ్యవధిలో రెండు సినిమాలు తలపడ్డాయి. బాలకృష్ణ్ సమరసింహారెడ్డితో సరికొత్త రికార్డులు సృష్టిస్తే, చిరంజీవి సినిమా యావరేజ్ గా నిలిచింది.

2000 – వంశోద్ధారకుడు vs అన్నయ్య

మళ్ళీ వారం గ్యాప్. అయితే ఈసారి విజయం చిరంజీవి దే.

2001 – నరసింహానాయుడు vs మృగరాజు

బాలకృష్ణు ఏకంగా ఇండస్ట్రీ హిట్ అందుకుంటే, మృగరాజు దారుణంగా విఫలమయ్యింది.

2004 – లక్ష్మీనరసింహ vs అంజి

ఇద్దరు చివరిసారిగా పోటిపడింది ఈ సినిమాలతోనే. ఈసారి కూడా బాలకృష్ణదే విజయం.

,