తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ 15 మందికి బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో తెలుసా.? కొంతమంది చిన్నప్పటినుండి ఫ్రెండ్స్.!

తెలుగు సినీ పరిశ్రమలో బాపూ,రమణ ల స్నేహం గురించి కనని వారూ,విననీ వారుండరు.స్నేహానికి మారుపేరుడా మారిన వీరిద్దరి ప్రయాణం మొదలైంది వారి బాల్యంలోనే…అలా మొదలైన స్నేహం వారితో పాటు పెరుగుతూ వచ్చింది.

 15 Best Friends Of Telugu Film Industry-TeluguStop.com

మిస్టర్ పెళ్లాం,ముత్యాల ముగ్గు ,సంపూర్ణ రామాయణం లాంటి బ్లాక్ బాస్టర్స్ ని ఇచ్చింది ఈ స్నేహ ద్వయమే.అంతేకాదు రమణ గారూ తన చివరి శ్వాస వరకూ సినిమాల్లో పనిచేసారు.

బాలక్రిష్ణ,నయనతార నటీనటులుగా శ్రీరామరాజ్యం సినిమా చేస్తున్న సమయంలో రమణ గారూ స్వర్గస్తులవగా.తన చిరకాల స్నేహితుడు పోయాడన్న బాదలో అతి కష్టం మీద బాపూ ఆ సినిమా పూర్తి చేసారు.

ఆ తర్వాత బాపూ కూడా పరమపదించారు.బాపూ,రమణ ఇద్దరిని వేర్వేరుగా చూడలేం.

ఇద్దరి పేర్లను వేరువేరుగా పలకలేం కూడా.అంతలా ముద్ర వేసుకున్నారు…బాపూ,రమణలంత స్నేహం కాకపోయినప్పటికీ కూడా మన తెలుగు పరిశ్రమలో మరికొందరు నటీనటులు స్నేహితులుగా ఉన్నారు.వారెవరో తెలుసా.

అర్జున్ – జగపతిబాబు


హనుమాన్ జంక్షన్ సినిమాలోె ప్రాణస్నేహితులుగా నటించారు అర్జున్ ,జగపతిబాబు.ఆ సినిమా తర్వాత వారు రియల్ లైఫ్ లో కూడా ప్రాణస్నేహితులుగా మారారు.ఏపనిమీదైనా హైదరాబాద్ వచ్చినప్పుడు అర్జున్ తప్పకుండా వెళ్లే చోటు ఏదన్నా ఉందంటే జగపతి బాబు ఇళ్లే.

జగపతిబాబూ అంతే చెన్నై వెళ్లినప్పుడల్లా అర్జున్ ఇంటికి తప్పకుండా వెళ్తారు.అంతేకాదు జగపతిబాబు వాళ్ల అమ్మతో కూడా అర్జున్ కి భావోద్వేగ సంభందం ఉంది.అర్జున్ ని వారి ఫ్యామిలి మెంబర్ గా చూస్తారు జగపతిబాబు కుటుంబ సభ్యులు.

రాంచరణ్ – శర్వానంద్


వీరి స్నేహం సినిమాల్లోకి వచ్చిన తర్వాత మొదలైంది కాదు.వారిద్దరీ సెవెన్త్ గ్రేడ్ చదువుతున్నప్పటి నుండి ఇద్దరూ ఫ్రెండ్స్.వారిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అని చరణ్,శర్వానంద్ ఇప్పటివరకూ చాాలా ఇంటర్వ్యూస్ లో చెప్పారు.

ఎలాంటి తారతమ్యాభేదాలు లేని స్నేహాల గురించి కనుక చెప్పుకోవాల్సోస్తే వారిలో వీరిద్దరూ ఉంటారు.

రాంచరణ్ – అల్లు అర్జున్ – రాణా దగ్గుబాటి


వీరు ముగ్గురు ఇప్పటివరకూ ఏ ఒక్క సినిమాలోనూ కలిసి నటించలేదు.వీరి స్నేహానికి కారణం వీరి కుటుంబాల మధ్య ఉన్న స్నేహమే.అల్లు అర్జున్ ,రాం చరణ్ బావా బామర్దులు అయినప్పటికీ వీరి మధ్య రక్త సంభందం కంటే స్నేహబందమే ఎక్కువుంది.

అదే విధంగా రాాణా,రాంచరణ్,అర్జున్ ఈ ముగ్గురి స్నేహం కూడా విడదీయరాని బందంగా ఉండడానికి కారణం వీరి స్నేహానికి పునాది వారి బాల్యంలో పడడమే…వారితో పాటు వారి స్నేహబంధం పెరుగుతూ వచ్చింది తప్ప,తగ్గలేదు.

నాగార్జున – చిరంజీవి


సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు పెద్ద హీరోస్ మధ్య స్నేహం కన్నా పోటీతత్వమే ఎక్కువగా ఉంటుంది.కానీ నాగార్జున ,చిరంజీవి దానికి మినహాయింపు.వీరిద్దరూ మాత్రమే కాదు,వీరి కుటుంబాల మధ్య కూడా సత్సంభందాలున్నాయి.

జూ.ఎన్టీయార్ – రాజీవ్ కనకాల


ఎన్టీయార్ హీరోగా పరిచయం అయిన సినిమా స్టూడెంట్ నం.1.అందులో ప్రతినాయక పాత్ర పోషించాడు రాజివ్ కనకాల.వీరిద్దరి స్నేహం అప్పుడు ప్రారంభయింది.ఇంకా కొనసాగుతుంది.వీరి స్నేహబంధం కారణంగానే ఎన్టీయార్ తన ప్రతి సినిమాలో రాజీవ్ కి ఒక పాత్ర ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటాడు.

మంచు లక్ష్మీ – తాప్సీ పన్ను


మంచు లక్ష్మీ,తాప్సీ ల స్నేహం ఝుమ్మందినాదం సినిమా షూటింగ్ టైంలో ప్రారంభమయింది.ఆ సినిమా ద్వారానే తాప్సీ టాలివుడ్ కి పరిచయం కాగా,ఆ సినిమాకి లక్ష్మీ నిర్మాతగా వ్యవహరించింది.ఆ సినిమా తర్వాత తాప్సీ మంచు ఫ్యామిలి మెంబర్లా మారిపోయింది దానికి కారణం వీరిద్దరి మధ్య ఉన్న స్నేహమే.

వీరిద్దరి ఎఫ్బీ పేజెస్ ని గమనిస్తే వీరి మధ్య ఫ్రెండ్షిప్ ఎంత స్ట్రాంగో తెలుస్తుంది.

గోపిచంద్ – ప్రభాస్


వర్షం సినిమా అటు ప్రభాస్ కి ,ఇటు గోపిచంద్ కి బ్రేకిచ్చిన సినిమా.అందులో ప్రభాస్ హీరో గా నటిస్తే ,గోపిచంద్ విలన్ గా ప్రేక్షకుల అభిమానాన్ని పొందాడు.వీరి స్నేహం వర్షం సినిమా అప్పుడే ప్రారంభమయింది.

ఆ సినిమా తర్వాత ఇద్దరూ కలిసి నటించనప్పటికీ వీరి మద్య స్నేహం మాత్రం అలానే ఉంది.ఇప్పటీకి గోపిచంద్ సినిమాల ఆడియో లాంచ్ కి ప్రభాస్ తప్పకుండా అటెండ్ అవుతాడు.

అది వారి స్నేహానికి ప్రభాస్ ఇస్తున్న గౌరవం .

పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్


జల్సా,అత్తారింటికి దారేది సినిమాల తర్వాత త్రివిక్రమ్,పవన్ ల మధ్య స్నేహం బలపడింది.దానికి కారణం వారిద్దరి అభిరుచులు ,జీవన విధానం కలవడమే.డైరెక్టర్,హీరోలు పరిచయం అయిన వీరిద్దరూ మంచి స్నేహితులుగా టాలివుడ్లో గుర్తింపు పొందారు.

పవన్ కళ్యాణ్ – ఆలీ


తొలిప్రేమ సినిమా అప్పుడు ప్రారంభమయింది పవన్,ఆలీల స్నేహం.ఆ సినిమా పవన్ కెరీర్లో ఎంత పెద్ద హిట్టో మనందరికి తెలుసు.ఆ తర్వాత పవన్ ప్రతి సినిమాలో ఆలికి ఒక పాత్ర ఉండేలా చూసుకుంటాడు.ఆలీ లేకుండా తన సినిమా పరిపూర్ణం కాదని ఇప్పటి వరకూ పవన్ చాలా సార్లు చెప్పాడు.

త్రివిక్రమ్ – సునీల్


వీరి స్నేహం సినిమా కష్టాలతో ప్రారంభమయింది.ఇద్దరూ సినిమాల్లో అవకాశాల కోసం హైదరాబాద్ వచ్చి,ఒకే రూంలో ఉండి సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు సాగించేవారు.ఆ సమయంలో సునీల్ కి కమెడియన్ కొన్ని ఛాన్సులు రావడంతో తనకు తెలిసిన వారికి త్రివిక్రమ్ ని సిపారసు చేయడం.ఆ తర్వాత త్రివిక్రమ్ కూడా తన ప్రతిభతో మరిన్ని అవకాశాలు పొందడం జరిగింది.

కమెడియన్ నుండి హీరో వరకు సునీల్ ఎదిగినా,మాటల రచయిత నుండి స్టార్ డైరెక్టర్ గా త్రివిక్రమ్ ఎదిగినా వీరి స్నేహం మాత్రం చెక్కుచెదర్లేదు.

శ్రీను వైట్ల – వివి వినాయక్


దర్శకత్వ ప్రతిభలో వీరిద్దరూ భిన్న ధృవాలు ఒకరేమో కామెడిని పండిస్తే మరొకరు తమ సినిమాల్లో యాక్షన్ ని చూపిస్తారు.వారే వివి వినాయక్,శ్రీను వైట్ల.వీరిద్దరూ ఇవివి సత్యనారాయణ దగ్గర అసిస్టెంట్స్ గా చేస్తున్నప్పటి నుండి ఫ్రంెడ్స్.

ఏరా బావ అంటే ఏరా బావ అనుకునేంత స్నేహం వీరిద్దరిది.

కోట శ్రీనివాసరావు – బాబూ మోహన్


బొబ్బిలి రాజా సినిమాతో ప్రారంభమయిన వీరిద్దరి స్నేహం.తర్వాత అటు ఆన్ స్క్రీన్ ఇటు ా ఆఫ్ స్క్రీన్లో కంటిన్యూ అయింది.కోట శ్రీనివాస రావు ని గురువుగా అన్నయ్యగా చూస్తాడు బాబూమోహన్.

రవితేజ – పూరిజగన్నాద్


ఎనర్జిటిక్ హీరో రవితేజ,డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాద్ ఇద్దరూ ఎక్కడుంటే అక్కడ నవ్వులే నవ్వులు.ఎన్నో ఏళ్ల రవితేజ కెరీర్ కు పెద్ద బ్రేక్ ఇచ్చారు పూరి జగన్నాద్.ఇట్లు శ్రావణి సుభ్రహ్మణ్యంతో ప్రారంభయిన వీరి స్నేహం తర్వాత అనేక హిట్లను టాలివుడ్ కి ఇచ్చింది.

సమంతా – నీరజ కోన


హీరోయిన్ కి,తన స్టైలిష్ట్ కి మధ్య స్నేహం అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే.వీరిద్దరికి స్నేహం ఎలా కుదిరింది అని ఇప్పటికీ ఆశ్చర్యపోతుంటారు సమంతా,నీరజ కోన స్నేహాన్ని చూసినవారు.సమంతాకి ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేస్తుంది నీరజ.

ఈమె ఎవరో కాదు కోన వెంకట్ కి కజిన్ సిస్టర్…సమంతాతో వర్క్ చేస్తున్న వారందరితో క్లోజ్ గా ఉంుటందన్న విషయం మనకు తెలుసు.కానీ నీరజతో ఫ్రెండ్షిప్ పాళ్లు కొంచెం ఎక్కువే .ఎంత అంటే ఒకరికొకరు బెస్ట్ ఫ్రెండ్స్ అని ఇప్పటికీ చాలా సార్లు చెప్పారు.డౌటుంటే వారి అఫీషియల్ సోషల్ నెట్వర్కింగ్ పేజెస్ చూడండి.

శివాజి రాజా – శ్రీకాంత్


వీరిద్దరూ కలిసి ఇప్పటివరకూ చాలా సినిమాల్లో నటించారు.రీల్ లైఫ్ స్నేహితులుగానే కాదు రియల్ లైఫ్ స్నేహితులుగా కూడా వీరు మంచి మార్కులే కొట్టేశారు.ఇద్దరూ కలిసి ఏవన్నా పార్టీలకు ,ఫంక్షన్స్ కి అటెండ్ అవ్వడం.రక్తదానం,అనాధ పిల్లలకు సహాయం చేయడం లాంటి పనులు ఇద్దరూ కలిసే చేస్తారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube