చిన్న వ‌య‌సులో పెద్ద ప్రయోగం: కోవిడ్‌పై ఆవిష్కరణకు తెలుగమ్మాయికి పురస్కారం

ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ 19కు సంబంధించి రోజుకొక కొత్త ఆవిష్కరణ చేస్తున్నారు వైద్యులు.వేగంగా ఫలితం నిర్థారించే టెస్టింగ్ కిట్లు, వైరస్‌ను అడ్డుకొనే మాస్క్‌లతో పాటు ఈ మహమ్మారిని అంతం చేసే వ్యాక్సిన్‌ను వైద్య ప్రపంచం అభివృద్ధి చేస్తోంది.

 14 Years Old Indian Origin Girl Wins National Award For Work On Finding Possible-TeluguStop.com

వారందరూ మేధావులు, ఎంతో అనుభవమున్న శాస్త్రవేత్తలు.కానీ కేవలం 14 ఏళ్ల వయసులో ఓ బాలిక కోవిడ్‌ చికిత్సకు ఉపకరించే ఆవిష్కరణపై పనిచేసి శెభాష్ అనిపించుకుంది.

ఆ సేవలకు గాను ఆమెకు జాతీయ పురస్కారంతో పాటు 3 ఎం యంగ్ సైంటిస్ట్ ఛాలెంజ్‌లోనూ విజేతగా నిలిచి 25,000 డాలర్ల బహుమతిని సొంతం చేసుకుంది.ఆ బాలిక మన తెలుగుమ్మాయే కావడం మనందరికీ గర్వకారణం.

వివరాల్లోకి వెళితే… టెక్సాస్‌కు చెందిన అనిక చేబ్రోలు ఇండిపెండెన్స్ హైస్కూలులో చదువుతోంది.ఈ క్రమంలో ఆమె అభివృద్ధి చేసిన అణువు.సార్స్ కోవిడ్ 2 వైరస్‌పై ఒక నిర్దిష్ట ప్రోటీన్‌ను నిలువరిస్తుందని చెప్పింది.ఈ ప్రోటీన్‌ను బంధించడం ద్వారా అది కరోనా వైరస్ ప్రోటీన్ పనితీరును నిలిపివేస్తుందని.

దీనిని తాను 682 మిలియన్ కాంపౌండ్ల డేటాబేస్‌తో ప్రారంభించానని అనిక పేర్కొంది.కొద్దినెలల కిందట జరిగిన ఈ పోటీలో అనిక పాల్గొంది.

ఆ సమయంలో ఆమె మిడిల్ స్కూల్‌లో చదువుతున్నారు.తొలుత స్వైన్ ఫ్లూపై తన ప్రాజెక్ట్‌ను రూపొందించుకోగా ఆపై కోవిడ్ 19పై పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారామె.

Telugu Anika Chebroll, Coronavirus, Covid, India, Orphans School, Sarc Covid, Sw

కోట్లాది మంది ప్రజలు ఈ వైరస్‌ బారినపడటంతో తన ప్రాజెక్టు విస్తృతి దృష్ట్యా కరోనా పై పరిశోధనను ఎంపిక చేసుకున్నానని అనిక చెప్పారు. వైద్య పరిశోధకురాలిగా కెరీర్‌ను ఎంచుకుంటానని ఆమె తెలిపింది.రసాయన శాస్త్రంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న తన తాతయ్య ప్రోత్సాహంతో తనకు సైన్స్‌ పట్ల ఆసక్తి పెరిగిందని పేర్కొంది.అన్నట్లు అనిక తండ్రి వైద్య వృత్తిలో ఉండటం విశేషం.

కాగా అమెరికాకే చెందిన భారత సంతతి బాలిక 15 ఏళ్ల హీటా గుప్తా కూడా తన స్వచ్ఛంద సంస్థ ‘బ్రైటెనింగ్‌ ఎ డే’ ద్వారా.లాక్‌డౌన్‌‌లో వృద్ధులకు, చిన్నారులకు తన చర్యల ద్వారా ఉపశమనం కలిగిస్తోంది.

వారికి రంగుల పెన్సిళ్లు, కలరింగ్‌ పుస్తకాలు, వివిధ రకాల పజిల్స్‌ను బహుమతులుగా చేసి పంపడం ప్రారంభించింది.ఒంటరిగా కాలం గడిపే వృద్ధులకు ఉపశమనం కలిగించేందుకే ఇలా చేస్తున్నానని చెబుతోంది హీటా.

భారత్‌లోని ఎన్నో అనాథాశ్రమాలకూ హీటా వివిధ రకాలుగా తన సహాయాన్ని అందిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube