14 ఏళ్ల ఈ బాలుడు చేస్తున్న పని గవర్నమెంట్‌ పెద్దలను కూడా తల దించుకునేలా చేస్తోంది  

14 Year Old Ravi Teja Repair Potholes On Hyderabad\'s Roads He Is The Real Hero-scholl Holidays Work In Social Activiteis

మనం ఉండే ఇల్లు బాగుంటే చాలు, నా అనుకున్న వాళ్లు బాగుంటే చాలు అనుకునే వారు చాలా మంది ఉంటారు.అందరు అలా ఆలోచిస్తే మనం ఈ పరిస్థితుల్లో ఉండే వాళ్లమే కాదు.

14 Year Old Ravi Teja Repair Potholes On Hyderabad's Roads He Is The Real Hero-Scholl Holidays Work In Social Activiteis

తప్పులపై గళం ఎత్తే వారు కావాలి, స్వేచ్చ కోసం పోరాడే వారు కావాలి.కోట్లాది మందిలో కొందరు మాత్రం వారి కోసం మాత్రమే కాకుండా జనాల కోసం కూడా బతుకుతూ ఉంటారు.

అలాంటి వారిలో హైదరాబాద్‌కు చెందిన రవితేజ ఒకడు.ఇతడు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హీరో.జాతీయ స్థాయి మీడియా కూడా ఇతడి మంచితనంను గుర్తించి పతాక స్థాయిలో కవరేజ్‌ ఇవ్వడం జరిగింది.

14 Year Old Ravi Teja Repair Potholes On Hyderabad's Roads He Is The Real Hero-Scholl Holidays Work In Social Activiteis

  ఇంతకు రవితేజ చేసేది ఏంటో తెలుసా గుంటలు పడ్డ రోడ్లను బాగు చేయడం.సాదారణంగా ఇంటి ముందు రోడ్డు బాగాలేకుంటేనే నాకేంటి అంటూ పట్టించుకోకుండా ఉంటాం.కాని రవితేజ మాత్రం తన చుట్టు పక్కల ఉన్న ప్రధాన రోడ్లలో ఏది బాగాలేకున్నా కూడా ముందుకు నడుస్తున్నాడు.

చదువుకుంటూనే తనవంతు సాయం అన్నట్లుగా రోడ్లపై గుంటలు కనిపిస్తే వాటిని పూడ్చి పెట్టేస్తాడు.అతడు చేస్తున్న పనికి అంతా అభినందిస్తున్నారు.రోడ్లపై గుంటల వల్ల కొన్ని సార్లు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి.ఈ ప్రమాదాల నివారణ కోసం రవితేజ ఈ పనికి పూనుకున్నాడు.

  వర్షాకాలంలో రోడ్లపై ఉండే గుంటల్లో నీళ్లు నిండి ఉండి ఆ గుంట గురించి గుర్తించకుండా వాహనదారులు ఆ గుంటలో పడటం, యాక్సిడెంట్స్‌ అవ్వడం జరుగుతుంది.అందుకే రవితేజ రోడ్లపై ఉన్న గుంటలను పూడ్చి పెట్టాలనే నిర్ణయానికి వచ్చాడు.

తన చుట్టు పక్కల ప్రధాన రోడ్డు కాని, పక్క రోడ్డు కాని ఏదైనా గుంట కనిపిస్తే వెంటనే ఒక బస్తాలో మట్టి, కంకర వేసుకుని వెళ్తాడు.అక్కడ కంకరతో నింపి మట్టిని పోస్తాడు.అలా గుంటను కవర్‌ చేస్తాడు.

  ప్రతి సెలవు రోజున ఖచ్చితంగా 5 గుంటలను అయినా పూడ్చి కాని ఇంటికి వెళ్లడు.రోడ్డు పక్కనే ఉండే రాళ్లు మరియు మట్టినే ఉపయోగించి రోడ్డుపై ఉండే గుంటలను పూడ్చి వేయడం రవితేజకు తెలిసిన విద్య.అది కొన్ని రోజులకు వెళ్లి పోతుందని తెలిసినా కూడా మళ్లీ మళ్లీ వేస్తూనే ఉంటాడు.

ఆయన పనితనం మరియు ప్రతిభకు అంతా కూడా సోషల్‌ మీడియా జనాలు ఫిదా అయ్యి రియల్‌ హీరో రవితేజ అంటూ బిరుదు ఇచ్చేశారు.రవితేజకు ప్రస్తుతం 14 ఏళ్లు గత రెండు మూడు సంవత్సరాలుగా ఇదే పనిని అతడు క్రమం తప్పకుండా చేస్తూనే ఉన్నాడు.

ప్రభుత్వం మరియు స్వచ్చంద సంస్తలు కూడా అతడి కష్టంను గుర్తించి సత్కరించడంతో పాటు ఆర్ధిక సాయంను కూడా అందించడం జరిగింది.

.

తాజా వార్తలు

14 Year Old Ravi Teja Repair Potholes On Hyderabad\'s Roads He Is The Real Hero-scholl Holidays Work In Social Activiteis Related....