మునుగోడులో కమలనాథుల వ్యూహం అదిరిందిగా?

మునుగోడు ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే ఆ నియోజకవర్గంలో అప్పుడు ఎన్నికల హడావుడి మెదలైంది.దుబ్బాక, హుజురాబాద్‌లను గెలిచిన బీజేపీ మునుగోడును కూడా గెలవాలనే పట్టుదలతో ఉంది.

 14-member Committee To Steer Bjp's Campaign In Munugode,munugode,bjp,bandi Sanja-TeluguStop.com

దీని కోసం రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రణాళికలు రచించారు.తాజాగా పార్టీ స్టీరింగ్ కమిటీ చైర్మన్‌గా వివేక్‌ను నియమిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్ణయం తీసుకున్నారు.16 మందితో సభ్యులతో కూడిన స్టీరింగ్ కమిటీకి స్థానిక నాయకుడైన గంగిడి మనోహర్‌రెడ్డికి కో-ఆర్డినేటర్‌గా బాధ్యతలు అప్పగించారు.

ఇక ఈ స్టీరింగ్ కమిటీలో మాజీ ఎంపీలు ఏపీ రవీంద్ర నాయక్, రాపోలు ఆనంద్ భాస్కర్, జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్‌రావు, విజయశాంతితో పాటు ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ స్వామి గౌడ్, మాజీ మంత్రి చంద్రశేఖర్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్, మాజీ నేషనల్ బీసీ కమిషన్ మెంబర్ తల్లోజు ఆచారి, మాజీ ఎమ్మెల్యేలు ఎండల లక్ష్మీ నారాయణ, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్, దాసోజు శ్రవణ్‌ సభ్యులుగా ఉన్నారు.

Telugu Bandi Sanjay, Bjpcommittee, Etela Rajendar, Komatirajgopal, Munugode, Mun

ఉప ఎన్నిక ఇంచార్జీని కాకుండా ఏకంగా పెద్ద జంబో టీమ్‌ను ప్రకటించడంపై బీజేపీలో చర్చనీయాంశంగా మారింది.ఈ కమీటికి ముందు మునుగోడు ఉప ఎన్నిక ఇంచార్జ్‌గా వ్వవహారించేందుకు చాలా మంది నేతలు పోటీ పడ్డారు.రాజగోపాల్ రెడ్డి అభిప్రాయం మేరకు పార్టీ స్టీరింగ్ కమిటీ చైర్మన్‌గా వివేక్‌ ప్రతిపాందించారు.ఇంచార్జీని స్థానాన్ని ఆశించిన వ్యక్తులు నిరాశ పడకుండా స్టీరింగ్ కమిటీ పేరుతో 16 మందిని టీమ్ తయారు చేశారు.

మరి కొన్ని రోజుల్లో మండాలాల వారీగా ఇంచార్జ్‌లను నియమించనున్నారు.మండాలంతో పాటు ప్రతి గ్రామానికి ఓ ఇంచార్జ్‌ని నియమించి బూత్ స్థాయిలో ఓట్లను ఆకర్షించేందకు బీజేపీ పటిష్ట కార్యాచరణ రూపొందిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube