జుట్టు హెయిర్ స్టైల్ కోసం ఏకంగా 14 కోట్లు..?!

హెయిర్ కట్ కు సంబంధించి చాలా మంది రకరకాలుగా ఆలోచిస్తుంటారు.తమ హెయిర్ అలా ఉండాలని, ఆ స్టైల్ లో ఉండాలని అనుకుంటూ ఉంటారు.

 14 Crores For Hair Hairstyle Rapper, Dan Sur, Gold Chains, Hairstyle, Viral Lat-TeluguStop.com

అందుకోసం వారు చాలా డబ్బులు కూడా ఖర్చు చేస్తుంటారు.తాజాగా అమెరికాలోని ఓ వ్యక్తి తన హెయిర్ కట్ కోసం చాలా డబ్బును ఖర్చు చేశాడు.అమెరికాలోని లిల్ ఉజీ వెర్ట్ అనే ర్యాపర్ తన నుదుటికి రూ.175 కోట్ల విలువైన పింక్ డైమండ్ కుట్టుకుని కలకలం రేపాడు.సాధారణంగా ఎవరైనా తమ తల అందంగా కనిపించాలని, నిగారింపుతో ఉండాలని రంగు రంగుల డైలు వేసుకుని అలంకరించుకుంటారు.అయితే మెక్సికోకు చెందిన ర్యాపర్‌ డాన్‌ సుర్ మాత్రం తన తలనంతా బంగారమయం చేసుకున్నాడు.

తలంతా బంగారపు గొలుసులు ఉండేలా ఏర్పాటు చేసుకున్నాడు.అందుకోసం అతను ఏకంగా రెండు మిలియన్‌ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.14 కోట్లను ఖర్చు పెట్టి అందర్నీ అవాక్కయ్యేలా చేశాడు.

ప్రస్తుతం ఈ బంగారం జుట్టు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

ప్రముఖ మెక్సికన్‌ ర్యాపర్‌ డాన్‌ సుర్‌ జుట్టును బంగారు గొలుసులతో రెడీ చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

తన బంగారం హెయిర్ స్టైల్ కోసం దాదాపుగా అతను రెండు మిలియన్‌ డాలర్లను ఖర్చు పెట్టడంతో అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.జుట్టుకోసం తలపైన మొత్తం కూడా కొన్ని రకాల డిజైన్లతో బంగారు గొలుసులను అమర్చుకున్నాడు.

దీంతో అతని బంగారు జుట్టు కలను నెరవేరినట్లైంది.

Telugu Dan Sur, Gold Chains, Hairstyle, Rapper, Latest-Latest News - Telugu

అతను ఇలా బంగారు జట్టును ఏర్పాటు చేసుకోవడం సోషల్‌ మీడియాలో షేర్ చేయడంతో అందరూ ఆ బంగారు జుట్టును చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.మరికొందరు మాత్రం తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఎవరైనా కోటీశ్వరులు కావాలంటే అతని జుట్టును పట్టుకుంటే చాలని, ఆ జుట్టుతో కోటీశ్వరులు అయిపోవడం ఖాయమని ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.

బంగారపు గొలుసులతో జుట్టును ఏర్పాటు చేసుకున్న మొదటి ర్యాపర్ డాన్ సుర్ కావటం ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube