ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు! పశ్చిమ గోదావరిలో 14

ఇప్పుడు కరోనా వైరస్ వ్యాప్తి మూడో స్టేజిని దాటిపోతుంది.ఇండియాలో కరోనా కేసుల సంఖ్య మెల్లగా పెరుగుతున్నాయి.

 14 Corona Positive Cases In West Godavari District, Covid-19, Corona Effect, Loc-TeluguStop.com

ఇక ఏపీలో మొన్నటి వరకు కంట్రోల్ లో ఉన్న కరోనా కేసులు ఒక్కసారిగా పెరగడం మొదలయ్యాయి.అన్ని జిల్లాలలో ఈ కరోనా ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి.

కొందరి నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడు దీని ప్రభావం ఏ స్థాయిలోకి వెళ్లిపోయింది అర్ధంకాని పరిస్థితి నెలకొని ఉంది.ఢిల్లీలో మర్కాజ్ ప్రార్ధనలకి వెళ్లి వచ్చిన వారిలో ఏకంగా నిన్న ఒక్క రోజు రాష్ట్రంలో 21 కరోనా పోజిటివ్ కేసులు బయటపడ్డాయి.

వాటిలో మెజారిటీ భాగం ప్రకాశం జిల్లాలో బయటపడగా తరువాత విశాఖలో నాలుగు కేసులు బయటపడ్డాయి.

ఇదిలా ఉంటే ఈ రోజు ఈ కేసుల సంఖ్య మరింత పెరిగింది.

అన్ని జిల్లాలలో మర్కాజ్ ప్రార్ధనలకి వెళ్ళిన ముస్లింలని గుర్తించి వారికి పరీక్షలు జరిపించాగా తాజాగా

పశ్చిమ గోదావరి జిల్లాలో

ఏకంగా 14 కేసులు నమోదైనట్టు కలెక్టర్ రేవు ముత్యాలరాజు తెలిపారు.వీటిలో ఏలూరులో 6, భీమవరం, పెనుగొండలలో చెరో రెండు, ఉండి, గుండుగొలను, ఆకివీడు, నారాయణపురంలో ఒక్కో కేసు చొప్పు నమోదైనట్టు ఆయన పేర్కొన్నారు.

వీటితో కలిసి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 58కి పెరిగింది.జిల్లాలో మొత్తం 30 మందికి పరీక్షలు నిర్వహించగా 14 మందికి పాజిటివ్, మరో 10 మందికి నెగటివ్ రిపోర్టులు వచ్చాయని, ఆరుగురికి సంబంధించిన నివేదికలు రావాల్సి ఉందని కలెక్టర్ తెలిపారు.

నమాజ్ కి వెళ్ళిన వారు వెయ్యి మంది వరకు ఉండటంతో వారు ఏపీకి వచ్చిన తర్వాత మరల వివిధ ప్రాంతాలకి తిరగడం, ప్రార్ధనలకి వెళ్ళడంతో వీరి కారణంగా ఇంకెంత మందికి కరోనా వ్యాపించిందో అనేది తెలియాల్సి ఉంది.ఇప్పటి వరకు ఏపీలో మొత్తం 58 పోజిటివ్ కేసులు నమోదుగా వీటి సంఖ్య ఇకపై మరింత పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య శాఖ కూడా అనుమానం వ్యక్తం చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube