14 ఏళ్ల బాలికపై..సినిమా హాలులో అత్యాచారం..       2018-05-02   01:53:34  IST  Raghu V

ఈ మధ్య సినిమాల ప్రభావం యువతమీద ఎక్కువ గా పడుతోంది..తెలిసీ తెలియని వయసులో ఉన్న వాళ్ళు సైతం అత్యచారలలకి పాల్పడటం చూస్తుంటే ఆడపిల్లలని బయటకి పంపాలి అంటేనే తల్లి తండ్రులు బయపడుతున్నారు.. తల్లి తండ్రులు అంటే గౌరవం లేకపోవడమో లేక భయం లేకపోవడమో తల్లి తండ్రులు సరిగా పట్టించుకోక పోవడం వలనో ఉన్మాదులుగా తయారవుతున్నారు..వివరాలలోకి వెళ్తే..

బోరబండలో నివసించే ఓ బాలిక ప్రతి రోజూ విజేత థియేటర్‌ ఆవరణలోని నల్లా వద్దకు వచ్చి నీళ్లు తీసుకుపోతుంటుంది. మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో బాలిక తన వదినతో కలిసి అక్కడికి వచ్చింది.అయితే ఆమెపై ఎప్పటి నుంచో కన్నేసిన యువకుడు ప్రశాంత్‌(25) నీళ్ల కోసం సినిమా థియేటర్‌ ఆవరణలోకి వచ్చిన బాలిక(14) పై అత్యాచారానికి పాల్పడ్డాడు.

ముందుగా బాలిక ఆమె వదిన నీళ్లు తీసుకుని వెళ్లగా ఆమె మాత్రం నల్లా వద్దే ఉంది. థియేటర్‌లో స్వీపర్‌గా పనిచేస్తున్న హరినగర్‌కు చెందిన ప్రశాంత్‌ బాలికను బలవంతంగా అక్కడి మరుగుదొడ్డిలోకి లాక్కుని పోయాడు. బాలిక గట్టిగా కేకలు వేయడంతో తీవ్రంగా కొట్టి అత్యాచారం చేశాడు…ఈ క్రమంలో తపించుకున్న బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.