138 ఏళ్ల తరువాత ఆ స్కూల్లో బాలికలకు ఎంట్రీ...ఎందుకంటే? అమ్మాయిల కోసం కట్టిందే కానీ.!       2018-05-31   01:30:15  IST  Raghu V

దశాబ్ధాల పురాతన ఆచారాలకు మంగళం పలుకుతూ మహారాష్ట్రలోని పూణెలో గల ఒక పాఠశాలలో బాలికలకు ప్రవేశం కల్పించారు. 138 ఏళ్ల క్రితం స్వాతంత్ర సమరయోధుడు బాలగంగాధర్ తిలక్ ప్రారంభించిన ఈ స్కూలులో ఎట్టకేలకు బాలికలకు ఎంట్రీ లభించింది. ఈ సందర్భంగా స్కూలు ప్రిన్సిపాల్ మాట్లాడుతూ కొన్నిదశాబ్దాలుగా కొనసాగుతున్న లింగ వివక్షకు ముగింపు పలకాలని పాఠశాల యాజమాన్యం నిర్ణయించింది. ఫలితంగా పాఠశాలలో బాలికల ప్రవేశానికి అనుమతి లభించింది.


-


1880లో బాలగంగాధర్ తిలక్ ఇతర సంఘసేవకులు గోపాల్ గణేశ్ అగార్కర్, విష్ణుశాస్త్రి చిప్లుంకర్ తదితరులతో కలిసి ఈ పాఠశాలను ప్రారంభించారు. ఈ పాఠశాలను డెక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ పర్యవేక్షిస్తుంటుంది.

-


ఇక్కడ ఇప్పటివరకూ బాలురకు మాత్రమే విద్యను అందిస్తూ వస్తున్నారు. తాజాగా పాఠశాలలో బాలికలకు కూడా ప్రవేశం కల్పించాలని నిర్ణయించారు. దీంతో ఇప్పటికే 25 మంది బాలికలు ప్రవేశం పొందారు.