138 ఏళ్ల తరువాత ఆ స్కూల్లో బాలికలకు ఎంట్రీ...ఎందుకంటే? అమ్మాయిల కోసం కట్టిందే కానీ.!

దశాబ్ధాల పురాతన ఆచారాలకు మంగళం పలుకుతూ మహారాష్ట్రలోని పూణెలో గల ఒక పాఠశాలలో బాలికలకు ప్రవేశం కల్పించారు.138 ఏళ్ల క్రితం స్వాతంత్ర సమరయోధుడు బాలగంగాధర్ తిలక్ ప్రారంభించిన ఈ స్కూలులో ఎట్టకేలకు బాలికలకు ఎంట్రీ లభించింది.ఈ సందర్భంగా స్కూలు ప్రిన్సిపాల్ మాట్లాడుతూ కొన్నిదశాబ్దాలుగా కొనసాగుతున్న లింగ వివక్షకు ముగింపు పలకాలని పాఠశాల యాజమాన్యం నిర్ణయించింది.ఫలితంగా పాఠశాలలో బాలికల ప్రవేశానికి అనుమతి లభించింది

 138-TeluguStop.com



1880లో బాలగంగాధర్ తిలక్ ఇతర సంఘసేవకులు గోపాల్ గణేశ్ అగార్కర్, విష్ణుశాస్త్రి చిప్లుంకర్ తదితరులతో కలిసి ఈ పాఠశాలను ప్రారంభించారు.ఈ పాఠశాలను డెక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ పర్యవేక్షిస్తుంటుంది.


ఇక్కడ ఇప్పటివరకూ బాలురకు మాత్రమే విద్యను అందిస్తూ వస్తున్నారు.తాజాగా పాఠశాలలో బాలికలకు కూడా ప్రవేశం కల్పించాలని నిర్ణయించారు.దీంతో ఇప్పటికే 25 మంది బాలికలు ప్రవేశం పొందారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube